ఇక రాజశేఖర్ 'గరుడవేగ' తర్వాత వరుసగా థ్రిల్లర్ జానర్లోనే సినిమాలు చేస్తున్నాడు. సక్సెస్‌ని కంటిన్యూ చేసేందుకు యాక్షన్ థ్రిల్లర్స్‌లో నటిస్తున్నాడు. ప్రశాంత్ వర్మతో 'కల్కి' చేశాడు. ఇప్పుడు మల్లికార్జున్ దర్శకత్వంలో చేస్తోన్న 'శేఖర్', వెంకటేశ్ మహా డైరెక్షన్‌లో వస్తోన్న 'మర్మాణువు' సినిమాలు థ్రిల్లర్ జానర్‌లోనే వస్తున్నాయి.
మాస్ మూవీస్‌తో హంగామా చేసే రవితేజ ఇప్పుడో యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు. సైకలాజికల్ థ్రిల్లర్ 'రాక్షసుడు' సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి హిట్ ఇచ్చిన రమేశ్ వర్మ ఇప్పుడు మాస్ మహారాజ్‌తో 'ఖిలాడి' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో రవితేజ డ్యుయల్ రోల్ ప్లే చేస్తున్నాడని, సైకో కిల్లర్‌గా నెగటివ్ షేడ్స్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. మరి ఆ విధంగా ఆడియన్స్ హ్యాపీగా ఫీలవుతారో.. లేక విమర్శలు గుప్పిస్తారో చూడాలి.