తెలుగు హీరోలు పాన్ ఇండియన్ మార్కెట్‌ని ఫోకస్ చేస్తోంటే, తమిళ స్టార్లు తెలుగు మార్కెట్‌పై కన్నేస్తున్నారు. ఇప్పటికీ డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ఆడియన్స్‌ని పలకరించిన కోలీవుడ్‌ స్టార్స్, ఇప్పుడు స్ట్రయిట్‌ మూవీస్‌తో తెలుగులో జెండా పాతాలనుకుంటున్నారు.

కోలీవుడ్‌ టాప్‌ హీరో విజయ్ కొన్నాళ్లుగా తెలుగు మార్కెట్‌పై స్పెషల్‌ ఫోకస్ పెడుతున్నాడు. 'విజిల్, మాస్టర్' సినిమాలకి తెలుగునాట మంచి వసూళ్లు రావడంతో, రెట్టించిన ఉత్సాహంతో తెలుగు సినిమాలకి సైన్ చేస్తున్నాడు. దిల్‌ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక బైలింగ్వల్‌కి సైన్ చేశాడు విజయ్.

ధనుష్ సినిమాలకి తమిళనాడులో ఎంత ఫాలోయింగ్‌ ఉందో, తెలుగులోనూ అదే క్రేజ్ ఉంది. యూనిక్‌ సబ్జెక్ట్స్‌తో సినిమాలు చేస్తాడనే ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్‌ని మరింత పెంచుకోవడానికి శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో మల్టీలింగ్వల్ మూవీ చేస్తున్నాడు ధనుష్. నారాయణ్‌ దాస్ నారంగ్‌ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది.

శివ కార్తికేయన్ 'రెమో' డబ్బింగ్‌తో తెలుగు ఆడియన్స్‌కి కూడా కనెక్ట్ అయ్యాడు. ఈ మూవీ తర్వాత మళ్లీ డబ్బింగ్‌ సినిమాలతో టాలీవుడ్‌కి వచ్చినా అంత రెస్పాన్స్ రాలేదు. అయితే ఇప్పుడు స్ట్రయిట్‌ తెలుగు మూవీతోనే టాలీవుడ్‌లో హంగామా చెయ్యాలనుకుంటున్నాడట. 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్‌ దర్శకత్వంలో శివ కార్తికేయన్ ఒక సినిమా చేస్తాడని చెబుతున్నారు.

సూర్య స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తానని చాన్నాళ్లుగా చెప్తున్నాడు. అయితే ఇప్పటివరకు తెలుగు సినిమా మాత్రం చేయలేదు. కానీ ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సూర్య ఒక సినిమా చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఇక సూర్య తమ్ముడు కార్తి అయితే ఇప్పటికే నాగార్జునతో కలిసి 'ఊపిరి' సినిమా చేశాడు.


మరి కోలీవుడ్ స్టార్స్ ఇక్కడ రికార్డులు క్రియేట్ చేయాలని చూస్తున్నారు. మన స్టార్ హీరోలు మాత్రం ఉత్తరాదిన సత్తాచాటాలని చూస్తుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే మన బలహీనతను వాళ్లు ఆసరాగా చేసుకున్నట్టే ఉంది. చూద్దాం.. మనోళ్లు మనసు మార్చుకుంటారో.. లేక తమిళ హీరోలకు అవకాశం ఇస్తారో.






 

మరింత సమాచారం తెలుసుకోండి: