టాలీవుడ్ స్టార్ డైరక్టర్స్ లో త్రివిక్రం శ్రీనివాస్ ఒకరు. రైటర్ గా తన ప్రస్థానం మొదలు పెట్టి స్టార్ డైరక్టర్ గా కొనసాగుతున్న త్రివిక్రం శ్రీనివాస్ సినిమాలు మిగతా దర్శకుల సినిమాల కన్నా ప్రత్యేకంగా ఉంటాయని చెప్పొచ్చు. ముఖ్యంగా త్రివిక్రం సినిమాల్లో ఓ మహా అద్భుతమైన కథ ఉండదు. మనకు తెలిసిన.. మన పక్కన జరిగే కథలాంటి కథనే ఎంచుకుంటారు. అలాంటి కథకు తన పెన్ పవర్ తో మాటల తూటాలని కలిపి వదులుతారు.

సాధారణ పాత్రలో.. సాధారణ సన్నివేశాలే త్రివిక్రం మాటలకు మహా గొప్పగా మనసు లోతుల్లోకి వెళ్లిపోతాయి. అందరు చెప్పే విషయాన్నే మరో విధంగా అందరు నిజమే అని భావించేలా.. నమ్మేలా చేస్తాడు త్రివిక్రం. అందుకే ఆయన్ను మాటల మాంత్రికుడు అని అంటారు. మొదట్లో రచయితగా తన ప్రతిభ కనబరిచిన త్రివిక్రం ఆ తర్వాత దర్శకుడిగా కూడా మెప్పించడం మొదలు పెట్టారు. ముఖ్యంగా త్రివిక్రం కథలు అన్ని కుటుంబం.. విలువలతో కూడిన కథలనే తీసుకుంటాడు. ఎంచుకున్న కథకి తనదైన శైలిలో మాటలను రాసి ప్రేక్షకుల మెప్పు పొందుతాడు.

ఇప్పటికీ త్రివిక్రం కు కథలు రాయడం రాదు అనే వారు ఉన్నారు. అవును త్రివిక్రం కు కథలు రాయడం పెద్దగా రాదని భావించినా రాసుకున్న కథలనే అందంగా తీర్చిద్దడం తెలుసు. అదే కథలతో ప్రేక్షకుల హృదయాలను కదిలించడం తెలుసు. సినిమా కథలతో జీవిత సారాన్ని చెప్పే చాలా మంది దర్శకులలో త్రివిక్రం ఒకరని చెప్పొచ్చు. ప్రత్యేకంగా త్రివిక్రం మాటలకు చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని తెలిసిందే. మాములు మాటలనే మహా అద్భుతంగా చెప్పించడం.. రాయడం ఆయన వల్లే సాధ్యం అవుతుంది అనిపించేలా చేస్తాడు. అందుకే ఆయన్ను చాలా మంది గురూజీ అంటుంటారు. కథ ఎలాంటిదైనా ఆ కథను అందమైన మాటలతో నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తాడు త్రివిక్రం శ్రీనివాస్ అందుకే ఆయన సినిమాల్లో కథ కన్నా డైలాగ్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. అలా మ్యాజిక్ చేస్తాడు త్రివిక్రం.




మరింత సమాచారం తెలుసుకోండి: