నెలకి కామన్ గా నాలుగు సినిమాలు అయినా విడుదల అవుతానే ఉంటాయి. ప్రతి  శుక్రవారం థియేటర్లో పండగ వాతావరణం కనిపిస్తుంది. అయితే ఎన్నో సినిమాలు వచ్చినా అందులో ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడే సినిమాలు మోటివేషనల్ సినిమాలేన‌ని చెప్పాలి. ఎందుకంటే కొన్ని సినిమాలు ఎంతో ఎంటర్టైన్మెంట్ తో నిండి అప్పటివరకు ప్రేక్ష‌కుడిలో ఉన్న బాధని, అత‌డు మ‌ర్చిపోవాల‌నుకున్న విష‌యాల‌ను తొల‌గిస్తాయి. కానీ మోటివేషన్ సినిమాలు మాత్రం కొంత మంది జీవితాల‌నే మార్చేస్తుంటాయి. ఈ సినిమాలో ఏదో ఉంది... ఏదో ఒకటి నేర్చుకోవాలి అనిపించే సినిమాలే మోటివేష‌న‌ల్ సినిమాలు, అలా ఈ సినిమా నుండి కచ్చితంగా నేర్చుకోవాల్సిందే అనిపించే సినిమా రఘువరన్ బీటెక్. 

తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ర‌ఘువ‌రుణ్ బీటెక్ సినిమాను తెలుగులోనూ విడుదల చేశారు. ఈ చిత్రంలో అమలాపాల్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి ఆర్ వెల్ రాజు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాకు అనిరుద్ స్వరాలు సమకూర్చారు. సాధారణంగా అయితే సినిమాల్లో హీరోలు అంటే యాక్షన్ లు చేయాలి..కలర్ ఫుల్ బట్టలతో క‌నిపించాలి. కానీ ఈ సినిమాలో మాత్రం రఘువరన్ మిడిల్ క్లాస్ కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తాడు. అంతేకాకుండా ప్రస్తుతం ఎంతో మంది ఎదుర్కొంటున్న సమస్య అయిన చదివింది ఒకటి చేసే ఉద్యోగం మరొకటి అన్న‌దాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించాడు. అలాంటి సమయంలో హీరో తాను చదివిన చదువుతోనే త‌న‌కు న‌చ్చిన ఉద్యోగం ఎలా సాధించుకున్నాడు.

ఎన్నో కార్పొరేట్ శక్తులను ఎదుర్కొని తన కలను ఎలా సాకారం చేసుకుంటాడు. పదిమందికి సాయ పడేలా ఎలా ఆలోచిస్తాడు. అంతే కాకుండా త‌న లాంటి నిరుద్యోగులంద‌రికీ ఎలా ఉపాధి క‌ల్పించాడు అనేదే ఈ సినిమా. ఇక అలా త‌మ‌కు న‌చ్చిన ప‌నే చేయాల‌నుకునే ఎంతో మంది నిరుద్యోగుల‌కు ఈ సినిమా ఇన్స్పిరేష‌న్ గా నిలుస్తోంది. ఇక‌ కేవలం మోటివేష‌న్ ఇచ్చేలా సినిమాను ఎమోష‌నల్ స‌న్నివేశాల‌తో తెర‌కెక్కిస్తే ఎవరూ ప‌ట్టించుకోరు. కాబట్టి సినిమాలో కావలసినంత ఎంటర్టైన్మెంట్ మరియు ఆకట్టుకొనే సంగీతం తో తెర‌కెక్కించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: