కోలీవుడ్ హీరో ఆర్య కథనాయకుడిగా పారంజిత్ దర్శకత్వంలో విడుదలకు సిద్ధం అయిన సర్పట్ చిత్రం తెలుగు ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది.తమిళ్ ట్రైలర్ కు భారీగానే రెస్పాన్స్ వచ్చింది. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కనున్న ఈ మూవీపై అంచానాలు తీవ్రస్థాయిలోనే ఉన్నాయి. అయికే కేవలం తెలుగు అభిమానులే కాదు..తమిళ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా సినిమాకోసం ఎదురుచూస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
తెలుగు ట్రైలర్ ను రానా దగ్గుపాటి సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. k9  స్టూడియో పతాకం పై నిర్మాత షణ్ముక రాజా రెండు భాషల్లో  ఈ మూవీని నిర్మించారు. ఆర్యతో పాటు తుషారా, కలైయరసన్‌, పశుపతి, జాన్‌ విజయ్‌, కాళి వెంకట్‌ ఇంకా తదితరులు ఈ చిత్రంలో నటించారు. సంగీతాన్ని సంతోష్ నారయణ్ అందిచారు.


అయితే ఈ మూవీపై రానా దగ్గుపాటి ట్రైలర్ విడుదల చేసిన అనంతరం ఫెంటాస్టిక్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ చెప్పారు. ట్రైలర్ కు య్యూటూబ్ లో మంచి స్పందన వచ్చింది.  భారీగా వ్యూస్ ను దక్కించుకుంది. ఇలా ట్రైలర్ వచ్చిందో లేదో సామాజిక మాధ్యమాల్లో ఇదేహాట్ టాపిక్ . షేరింగ్ అవుతూ సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ట్రైలర్ చెక్కర్లు కొడుతోంది.

రాజారాణి సినిమాతో మనందరి మనసులు దోచుకున్న ఆర్యది ఈ చిత్రంలో లుక్ వేరే ఉంది. గత సినిమాలకు భిన్నంగా బాక్సర్ గా ఈ మూవీలో కనిపించనున్నారు. ఎప్పటినుంచో స్పోర్ట్ డ్రామాలో నటించాలని ఆర్యకోరిక. ఈ సినిమా ద్వారా అది తీరనుంది. కబలిన్ పాత్ర తనను బాగా ఆకర్షించినట్లు ఆర్య ఇప్పటికే చెప్పారు. తన మనసుకు ఎంతగానో దగ్గరైన ఈ పాత్ర ప్రేక్షకులు మనసను కూడా గెలుచుకుంటుందని భావిస్తున్నట్లు ఆర్య ఓ ఇంటర్వూలో తెలిపారు. కాగా జులై 22న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం విడుదల కానుంది

మరింత సమాచారం తెలుసుకోండి: