ఇటీవలే కరోనా వైరస్ కారణంగా థియేటర్లకు గడ్డు పరిస్థితి ఏర్పడింది. కరోనా వైరస్ నేపథ్యంలో థియేటర్లు తెరుచుకోవడం పై కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి ప్రభుత్వాలు. ఒకవేళ థియేటర్లు తెరిచేందుకు అనుమతించిన కేవలం 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో మాత్రమే తెరిచేందుకు అనుమతిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో దాదాపుగా థియేటర్లు మూత పడిపోయాయి. అయితే ఇక ఇటీవల కాలంలో ఓటిటి ఫ్లాట్ఫామ్ కూడా ఎంతగానో క్రేజ్ పెరిగిపోయింది. స్టార్ హీరోల సినిమాలు సైతం ఓటిటీ లోనే విడుదల అవుతూ ఉండటం గమనార్హం.  ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు ఓటిటి లో విడుదలయ్యాయి. ఇక ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన నారప్ప సినిమా కూడా ఈ నెల 20వ తేదీన ఓటిటిలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.



 అమెజాన్ ప్రైమ్ లో నారప్ప సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే నారప్ప ట్రైలర్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై వైరల్ గా మారిపోయింది. అయితే అటు వెంకటేష్ అన్న సురేష్ బాబు ఒక స్టార్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు.  అంతే కాదు ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సినిమా థియేటర్లు కూడా ఉన్నాయి  సినిమాలు థియేటర్ లోనే విడుదల అయ్యేలా చూడాలని గతంలో ఎన్నోసార్లు పోరాటం కూడా చేశారు సురేష్ బాబు. అలాంటి సురేష్ బాబు ప్రస్తుతం నారప్ప సినిమా లో సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.  సురేష్ బాబు నిర్మాత గా ఉన్నప్పటికీ ఇక నారప్ప సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఓటిటి వేదికగా విడుదల అవడంతో  ప్రస్తుతం తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.



 ఇలాంటి నేపథ్యంలో ఇటీవల సురేష్ బాబు తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు. తన సొంత బ్యానర్ అయిన సురేష్ ప్రొడక్షన్ లో నిర్మించబడిన సినిమాలు ఇక తన నిర్ణయాల ప్రకారమే విడుదల అవుతాయి అంటూ సురేష్ బాబు స్పష్టం చేశారు. అయితే వెంకటేష్ నటించిన నారప్ప సినిమాలో తాము కేవలం భాగస్వాములు మాత్రమే అంటూ సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. నిర్మాత నిర్ణయం ప్రకారమే ఓటిటీలో విడుదల చేసేందుకు సిద్ధం అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య మన కుటుంబ సభ్యులనే థియేటర్లకు సినిమాలు చూడటానికి పంపడం లేదు. అలాంటిది ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రేక్షకులను థియేటర్లకు రమ్మనడం ఏమైనా న్యాయమేన అంటూ ప్రశ్నించారు సురేష్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: