టాలీవుడ్ లో మెరుపుతీగలా రెండు మూడు సినిమాల్లో మెరిసి మాయపోయిన ముద్దుగుమ్మ సమీరా రెడ్డి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. తాను చేసింది తక్కువ సినిమాల్లోనే అయినా పెద్ద హీరోలతో చేయడం వల్ల ఈ అమ్మడుకి టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. కానీ అనంతరం ఈ ముద్దుగుమ్మ ఇక్కడ ఎక్కువ సినిమాలను చేయలేదు. ఇలా పెళ్లి చేసుకున్న సమీరా రెడ్డి అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉండేవారు. సమీరా రెడ్డి తెగువకు అందరూ అభినందించక మానరు. తాను పెళ్లయి ... మొదటి సారి గర్భవతి అయినపుడు ఏకంగా 105 కిలోల బరువుకు చేరుకుంది. అయినా కూడా ఏ మాత్రం బెదరకుండా తాను కడుపుతో ఉండగానే ఫొటో షూట్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. అయితే ఈ ఫొటోలతో అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. ఇంతలా బరువు అయ్యాక, పైగా గర్భంతో ఉండగా ఫొటో షూట్ అవసరమా అని చాలా మంది చాలా రకాలుగా కామెంట్లు చేశారు. ఈ కామెంట్లకు ఈ ముద్దుగుమ్మ ఎంతగానో నొచ్చుకుంది.


కానీ తరువాత రెండో సారి గర్భం దాల్చే సమయానికి అమ్మడుకి ఎక్కడ లేని తెగువ వచ్చేసింది. ఎలా కామెంట్ చేసినా పట్టించుకోకూడదని ఫిక్సయింది. రెండో సారి గర్భంతో ఉన్నపుడు ఏకంగా తెల్లవారితే డెలవరీ అనే సమయంలో ఫొటో షూట్ చేసి అందరి నోళ్లు మూతపడేలా చేసింది. పిల్లలు పుట్టిన తర్వాత తన బరువును తగ్గించుకునే ప్రయత్నంలో ఈ బ్యూటీ మరలా పాత సమీరా రెడ్డిలా మారిపోయారు. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలను చూసిన నెటిజన్లకు దిమ్మతిరిగి పోతుంది. అంతలా లావున్న సమీరా రెడ్డి ఇలా ఎలా మారిందని అంటున్నారు. సమీరా రెడ్డి అభిమానులు మాత్రం ఈ ఫొటోలను చూసి తెగ సంబరపడిపోతున్నారు. సమీరా రెడ్డి గర్భవతిగా ఉన్నపుడు బాడీ షేమింగ్ చేసిన వారి నోళ్లను తాజా ఫొటోలతో మూయించిందని కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: