టాలీవుడ్ సీనియర్
హీరో రాజశేఖర్ గరుడవేగ
సినిమా తో మళ్లీ కం బ్యాక్ చేసి పూర్వవైభవం తెచ్చుకునే ప్రయత్నం చేయగా ఆ తర్వాత చేసిన
కల్కి సినిమా దారుణమై న ఫ్లాప్ కావడం తో మరొక
సినిమా కోసం ఆయన చూడాల్సి న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో
రాజశేఖర్ మళ్లీ కథ కోసం అన్వేషిస్తూ ఉండగా ప్రస్తుతం ఓ మలయాళ
సినిమా రీమేక్ చేస్తున్నాడు.
శేఖర్ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ
సినిమా తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని
రాజశేఖర్ ఆశిస్తున్నా డు.
అయితే
రాజశేఖర్ హీరోగా మాత్రమే కాకుండా ఇతర పాత్రలను కూడా చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
టాలీవుడ్ సీనియర్ హీరోలు కొంతమంది ఇతర హీరోల సినిమాలలో మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ తన ఇమేజ్ ను పెంచుకుంటూ సినిమాలను హిట్ చేస్తున్నారు. ఈ విధంగా
రాజశేఖర్ కూడా ఇతర హీరోలతో సినిమాలు చేస్తే మంచిదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కీల క పాత్రలో నటించే అవకాశం వచ్చిందట.
గోపీచంద్ హీరోగా నటిస్తున్న సీటీమార్
సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ
సినిమా తర్వాత
మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే
సినిమా చేస్తున్నాడు. ఈ
సినిమా 50శాతం పూర్తవగా
శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ తన మూడు
సినిమా చేస్తున్నాడు. లక్ష్యం, లౌక్యం సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న ఈ కాంబినేషన్ ఇప్పుడు హ్యాట్రిక్ కోసం చూస్తుంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం
హీరో రాజశేఖర్ నటింపజేయాలని చూస్తుండగా ఈ మేరకు
రాజశేఖర్ ను సంప్రదించిదట చిత్ర బృందం. లక్ష్యం సినిమాలో జగపతి బాబు పోషించిన పాత్ర తరహాలో ఈ పాత్ర సాగుతుందని అంటున్నారు. మరి ఈ అవకాశాన్ని
రాజశేఖర్ సద్వినియోగం చేసుకుంటాడో లేదో చూడాలి.