తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్... తనయుడు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు టిఆర్ఎస్ పార్టీ లోనే కాదు రాష్ట్రంలో కీలకమైన నేత. అమెరికాలో ఉద్యోగం మానేసి తెలంగాణ ఉద్యమంలో పోరాడిన యువ కెరటం మంత్రి కేటీఆర్. తండ్రి అడుగుజాడల్లో నడవాలని అనే ఉద్దేశంతో... అమెరికాలో ఉన్న ఉద్యోగాన్ని లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమం కోసం పోరాడారు మంత్రి కేటీఆర్. అయితే అదృష్టవశాత్తూ కేటీఆర్ మొదటి సారి పోటీ చేయగానే ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొదటి నుంచి మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ఏర్పాటు అనంతరం కేటీఆర్ కు మంత్రి పదవి కూడా అనివార్యమైంది.

మున్సిపల్ శాఖ మరియు ఐటీ శాఖలకు కేటీఆర్ మంత్రి గా వ్యవహరిస్తున్నారు. అయితే... కేటీఆర్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే... క్షణాలలో స్పందిస్తారు మంత్రి కేటీఆర్. లాక్ డౌన్ సమయంలోనూ చాలా మంది పేద ప్రజలకు మంత్రి కేటీఆర్ అండదండలు అందించారు. ట్విట్టర్ వేదికగా వచ్చిన అనేక సమస్యలను దగ్గరుండి పరిష్కరించారు కేటీఆర్. అయితే అలాంటి గొప్ప నేత కేటీఆర్...పుట్టినరోజు ఈ నెల 24న ఉంది. 1976 లో జన్మించిన మంత్రి కేటీఆర్ ఇక 45వ సంవత్సరం లో అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ లోనూ మరియు ఆయన ఫ్యాన్స్ లోను ఇప్పుడే సందడి మొదలైంది. కేటీఆర్ పుట్టిన రోజును చాలా గ్రాండ్ గా చేయాలని... ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ టాలీవుడ్ నటి సన... మంత్రి కేటీఆర్ కోసం స్పెషల్ గిఫ్ట్ ప్లాన్ చేసింది.

అది ఏంటంటే.. కేటీఆర్ పుట్టిన రోజున..  ఒకే గంటలో మూడుకోట్ల మొక్కలు నాటి కేటీఆర్ కు గిఫ్ట్ గా ఇవ్వాలని నటి సన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం గురించి నటి సన తన సోషల్ మీడియా వేదికగా చెప్పారు. అయితే మూడు కోట్ల మొక్కలను నాటడం ఒకరి వల్ల కాదని.. అందుకే కేటీఆర్ అభిమానులు కూడా తలో మూడు మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. అంతేకాదు మొక్కలు నాటిన వారు సెల్ఫీలు దిగి ఫోటోలు పంపిస్తే... వారికి ఉత్తమ అవార్డు కూడా ఇస్తామని చెప్పుకొచ్చారు నటి సన.





మరింత సమాచారం తెలుసుకోండి: