
సీనియర్ హీరోలలో బాలకృష్ణ మార్కెట్ ఏమాత్రం బాగాలేదు. ఎన్టీఆర్ బయోపిక్ పరాజయం తరువాత షాక్ కు గురైన బాలయ్య ఇప్పుడు ఆ షాక్ నుండి తేరుకుని వరసగా సినిమాలు ఒప్పు కుంటున్నాడు. బోయప్పటి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న ‘అఖండ’ తో తన దశ తిరిగుతుందని చాల గట్టి నమ్మకంతో ఉండటంతో ఈ మూవీ విడుదల కోసం నందమూరి అభిమానులు చాల ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇలాంటి పరిస్థితులలో ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ బాలకృష్ణ చేసిన కామెంట్స్ పై ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ‘అఖండ’ మూవీ విడుదల కాకుండానే గోపీ చంద్ మలినేని మూవీ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టిన బాలకృష్ణ ఈమూవీ తరువాత అనీల్ రావిపూడి తో మరో సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడు.
తాను చేయబోతున్న మూవీ ప్రాజెక్ట్స్ వివరాలు తెలియచేస్తూ బాలకృష్ణ తాను హారికా కాసినీ సంస్థకు కూడ ఒక సినిమా చేయవలసి ఉంది అని చెప్పాడు. దీనితో త్రివిక్రమ్ బాలయ్యతో మూవీ చేయబోతున్నాడా అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. సాధారణంగా హారికా హాసినీ సంస్థ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తప్ప మరి ఇతర దర్శకులతో సినిమాలు చేసిన సందర్భాలు చాల తక్కువ. ఇప్పుడు బాలయ్య హారికా హాసినీ మూవీ ప్రాజెక్ట్ అంటే త్రివిక్రమ్ తో ఉంటుందా లేదంటే మరొక దర్శకుడు రంగంలోకి దిగుతాడా అన్న సందేహాలు వస్తున్నాయి.
వాస్తవానికి బాలకృష్ణ కు త్రివిక్రమ్ కు పెద్దగా సాన్నిహిత్యం లేదు. తనతో సన్నిహితంగా లేని హీరోలతో త్రివిక్రమ్ సినిమాలు చేయడానికి పెద్దగా ఆశక్తి కనపరచుడు. ఇలాంటి పరిస్థితులలో బాలకృష్ణ కోసం త్రివిక్రమ్ తన అభిప్రాయం మార్చుకుని ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేస్తాడా లేదా అన్నది రానున్న రోజులలో తెలుస్తుంది. ఈవార్తలే నిజం అయి వాస్తవ రూపం దాలిస్తే ఒకప్పుడు బాలకృష్ణ కోడి రామకృష్ణ చేసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీల సీజన్ మళ్ళీ ప్రారంభం అయ్యే ఆస్కారం ఉంది..