ఇక తన సినీ కెరీర్లో ఎంతో మంది హీరోయిన్లతో ఎన్నో సినిమాల్లో నటించిన కృష్ణ ఇద్దరు హీరోయిన్లతో మాత్రం ఎక్కువ సినిమాలు చేశారు. తన సతీమణి విజయనిర్మల తో పాటు మరో స్టార్ హీరోయిన్ జయప్రద తో ఏకంగా నలభై సినిమాలకు పైగా నటించారు. జయప్రద తో అయితే పోటీపడి మరీ 42 సినిమాల్లో నటించడం కృష్ణకే చెల్లింది. తన సినిమాల్లో జయప్రదనే ఏరీ కోరి మరి ఆయన హీరోయిన్ గా పెట్టుకునే వారట. ముందుగా శ్రీ రాజరాజేశ్వరి కాఫీ క్లబ్ సినిమాలో జయప్రద కృష్ణ పక్కన హీరోయిన్ గా నటించింది. ఆమె నటనకు ఫిదా అయినా కృష్ణ అప్పటి నుంచి ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా ఆమెనే రికమెండ్ చేసేవారట.
అయితే ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ఎఫైర్ నడిచినట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. అవుట్ డోర్ షూటింగ్ ల కి వెళ్ళినప్పుడు కూడా జయప్రద - కృష్ణ సన్నిహితంగా ఉండటంతో లేనిపోని పుకార్లు ఎక్కువగా ప్రచారం అయ్యాయి. అయితే కృష్ణ , జయప్రద ఎక్కువగా స్నేహంగా ఉండే వారు. కావాలనే కొందరు వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందనే ప్రచారం చేశారు. అయితే ఈ విషయాన్ని విజయనిర్మల కూడా చాలా లైట్ తీసుకుని వారి స్నేహాన్ని అర్థం చేసుకున్నారు. కృష్ణ , జయప్రద పై ఎన్ని రూమర్లు వచ్చినా విజయనిర్మల మాత్రం ఎప్పుడు పట్టించుకోలేదట. వారి స్నేహాన్ని ఆమె అంతగా అర్థం చేసుకున్నారని అంటారు.