టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కు ఎంతో క్రేజ్ ఉంది. అదే క్రేజ్ తో తనే సొంతంగా "జనసేన పార్టీ"స్థాపించాడు. కానీ ఈయనకు అనుకున్నంత ఫలితం రాలేదు. ఇక దాంతో ఈయన చేసేదేమీ లేక తిరిగి సినిమాల వైపు తను ముగ్గు చూపించాడు. ఏకంగా ఒకేసారి నాలుగు సినిమాలను లైన్ లో పెట్టారు పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ తో సినిమా తీసిన ఒక డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.

టాలీవుడ్ లోకి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ తో పవన్ కళ్యాణ్ తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి వచ్చారు. గోకులంలో సీత సినిమాకి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా  బాక్సాఫీస్ దగ్గర బాగానే ఆడింది. ఈ సినిమా బాగా ఆడిన కానీ ఈ సినిమాలో కొన్ని లోపాలున్నాయని డైరెక్టర్ తెలిపారు. ఇక ఈ సినిమా జీవీకే రాజు తమిళం నుంచి ఈ సినిమా హక్కులను  సొంతం చేసుకున్నాడు.

ఈ సినిమాను పవన్ కళ్యాణ్ తో నిర్మించాలని ఆయన పవన్ కళ్యాణ్ నుంచి డేట్స్ కూడా తీసుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న ముత్యాల సుబ్బయ్య, జీవీకే రాజును చిరంజీవి దగ్గరకు తీసుకెళ్ళి, ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను మార్చాలని తెలిపాడు సుబ్బయ్య. ఇక చిరంజీవి మీరు ఏమైనా చేయండి అని తెలిపారు. మొదట ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలను మార్చి మరీ తెరకెక్కించడం జరిగింది.

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ అప్పుట్లో "ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు, డైరెక్టర్ ఎలా చెబితే అలానే చేసేవారని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ నటించిన గోకులంలో సీత సినిమాని  బాగా పబ్లిసిటీ చేయమని నిర్మాతకు చెప్పమని చెప్పానని తెలిపారు సుబ్బయ్య. కానీ పవన్ కళ్యాణ్ మొహమాటంతో వారికి అసలు చెప్పలేకపోయాడు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి "అని తెలిపాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: