సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సీనియర్ హీరోయిన్ జయంతి(76) ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి కన్నుమూశారు. కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న జయంతిని ఇటీవల బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జాయిన్ చేయగా, అక్కడే చనిపోయారు. కన్నడ సినిమా ‘జైనుగూడు’తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన జయంతి మలయాళ, హిందీ, తెలుగు, మరాఠీ, తమిళ్ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. వైవిధ్యమైన పాత్రాలకు కేరాఫ్‌గా నటనలో తనదైన ముద్ర వేశారు. జయంతి తన కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్‌లో పవర్ ఫుల్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేసినప్పటికీ హీరోయిన్‌గా స్టార్ హీరోల సరసన నటించింది. వారు ఎవరంటే..


టాలీవుడ్ నటదిగ్గజాలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, విష్ణు వర్ధన్, కోలీవుడ్ హీరోలు ఎంజీఆర్, జెమినీ గణేషన్,  శివాజీ గణేషన్‌తో పాటు బాలీవుడ్ నటులు రాజ్ కుమార్, షమ్మీ కపూర్‌ సరసన కథానాయికగా నటించింది. ఇక పలు భాషల్లో సహాయ నటిగా ఆమె నటనకు ప్రేక్షకులు జేజేలు పలికారు. బాలీవుడ్ లో ఆమె చివరగా ‘ఓంశాంతిఓం’ చిత్రంలో కనిపించగా, తెలుగులో ఇటీవల సూపర్ హిట్ ఫిల్మ్‌లో నటించింది. మెగాస్టార్ చిరంజీవి సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చిన ‘సైరా నరసింహారెడ్డి’లో చక్కటి పాత్ర పోషించింది జయంతి. కాగా, కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే ఈమె పాలిటిక్స్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.


అయితే, ఆ రంగంలో ఆమె అనుకున్నంత సక్సెస్ కాలేకపోయారని చెప్పొచ్చు. 1998లో లోక్‌సభ ఎన్నికల్లో లోకశక్తి పార్టీ తరఫున చిక్‌బళ్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆమె మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 1999లో జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కోరటగిరే నియోజకవర్గం నుంచి పోటీ చేసి అక్కడ కూడా ఓటమి చవి చూడాల్సిందే. మొత్తంగా ఆమె దాదాపు ఐదొందలకు పైగా సినిమాల్లో నటించింది. ఇందులో 300 సినిమాల్లో హీరోయిన్‌గా నటించడం విశేషం. తెలుగులో ‘భార్యభర్తలు’ జయంతి తొలిచిత్రం కాగా, ‘డాక్టర్ చక్రవర్తి, జస్టిస్ చౌదరీ, జగదేక వీరుడి కథ, దొంగ మొగుడు, పెదరాయుడు, కొదమ సింహం’చిత్రాల్లో నటించింది. జయంతి మృతి పట్ల సినీలోకం అభిమానులు, సంతాపం తెలుపుతున్నారు.  సినీ ప్రముఖులు ఆమెతో ఉన్న అనుంబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: