టాలీవుడ్ సినీ పరిశ్రమలో సీనియర్
హీరో రాజశేఖర్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇటీవలే గరుడవేగ సినిమాతో ఆయన మళ్లీ ఫామ్ లోకి వచ్చి హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అంతకుముందు యాంగ్రీ యంగ్ మ్యాన్ గా
రాజశేఖర్ తనదైన స్టైల్ లో సినిమాలు చేసి అప్పటి స్టార్ హీరోలకు పోటీ గా నిలిచాడు. ప్రతిఘటన, తలంబ్రాలు సినిమాల తర్వాత ఆయనకు భారీ ఎత్తున పేరు వచ్చింది.
ఆహుతి సినిమా ఆయనను యాంగ్రీ యంగ్ మ్యాన్ గా నిలిచేలా చేసింది. తలంబ్రాలు మూవీని నిర్మించిన శ్యాంప్రసాద్
రెడ్డి ఆహుతి సినిమా ను కూడా నిర్మించడం విశేషం.
కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ
సినిమా కథ విన్నప్పుడే మంచి చిత్రం అవుతుందని తప్పకుండా హిట్ అవుతుందని
రాజశేఖర్ అనుకున్నాడట. ఆయన అనుకున్న విధంగానే ఈ
సినిమా విడుదలై పెద్ద హిట్ అయింది. అయితే ఈ రేంజ్ హిట్ అవుతుందని మాత్రం ఆయన ఊహించలేదట. ఊహించిన దానికి మించి
ఆహుతి సినిమా కి లభించిన ఆదరణ చూసి ఎంతో ఉబ్బి తబ్బిబ్బు అయ్యారు రాజశేఖర్.
ఈ
సినిమా షూటింగ్ కి మందు
కోడి రామకృష్ణ రూపొందించిన
అశోక్ పాత్రను పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత ఇంత మంచి పాత్రకు ఏవిధంగానూ అన్యాయం చేయకూడదు అని తనలో తాను ప్రశ్న వేసుకున్నాడట రాజశేఖర్. ఆ మూవీలో
అశోక్ పాత్ర ఎలా ఉండాలో
కోడి రామకృష్ణ పాత్ర గురించి చెప్పగా దానికోసం ఆయన తన నడవడిక, మీసకట్టు వెరైటీ గా ప్రదర్శించారు. ఈ
సినిమా షూటింగ్ జరిగే రోజుల్లో ఆయనకు ఆరోగ్యం బాగా లేకపోయినా కూడా దాన్ని లెక్కచేయకుండా రాత్రిబవళ్ళు ఈ సినిమాలో యాక్టింగ్ చేసేవాడట. యాక్షన్ సన్నివేశాల్లో కూడా డూప్ లేకుండా నటించి ఆ
సినిమా ఇంత పెద్ద హిట్ అవడానికి కారణం అయ్యారు రాజశేఖర్.