నాగచైతన్య ఎక్కువగా పక్కింటి అబ్బాయి పాత్రలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం హారర్ ప్రాజెక్ట్స్ లో నటించడానికి సిద్ధమై అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నారు. సాధారణంగా లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న ఏ హీరో కూడా హారర్ జోనర్ ని టచ్ చేయడు. ఒకవేళ కెరీర్ పతనావస్థ ఉంటే అప్పుడు అన్ని జోనర్ లతో ప్రయోగాలు చేస్తుంటారు. మంచి ఫామ్ లో ఉన్న నాగచైతన్య మాత్రం యాక్షన్, హారర్ ఇలా చెప్పుకుంటూ పోతే పలు విభిన్నమైన జోనర్లతో ప్రేక్షకులను మెప్పించ డానికి రెడీ అవుతున్నారు. ఇటీవల ఆయన ఓ ఓటీటీ ప్రాజెక్టు చేస్తున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ యాజమాన్యంలో నిర్మాత శరత్ మరర్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మించబోతున్నారు. అయితే ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటో కింద వివరంగా తెలుసుకుందాం.



నాగచైతన్య మొదటి సారిగా ఓ ఓటీటీ వెబ్ సిరీస్ చేసేందుకు పచ్చజెండా ఊపారు. చైతు కోసం క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఒక మంచి హారర్ థ్రిల్లర్ కథ రెడీ చేశారు. నాగ చైతన్య ఇప్పటికే పూర్తి కథ విన్నారని.. ఆయనకు కథ బాగా నచ్చిందని తెలుస్తోంది. అయితే ఈ కథతో 8 ఎపిసోడ్లు రూపొందించనున్నారని సమాచారం. 8 ఎపిసోడ్స్ లో హారర్, డ్రామా, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంటాయని తెలుస్తోంది. వెబ్ సిరీస్ అయినా కూడా దీనిని మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అద్భుతంగా చిత్రీకరించనున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా రిలీజ్ కానుందని సమాచారం. ప్రముఖ తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్ సేవాసంస్థ ఆహా కుడి ఎడమైతే వంటి అద్భుతమైన వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరిస్తోంది. దీంతో ప్రైమ్ కూడా తెలుగులో వెబ్ సిరీస్ లు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.



ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. కాగా దసరా పండుగ తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నాగ చైతన్య ఆ సమయం లోపు థాంక్యూ, లాల్ సింగ్ చద్దా సినిమాలు పూర్తి చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: