నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులను కమిటవుతున్నాడు. తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'అఖండ' సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం తమిళనాడులో ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రలను పోషిస్తున్నారు.ఇప్పటికే వాటికి సంబంధించిన టీజర్లు విడుదలై భారీ రెస్పాన్స్ ని అందుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేర్చాయి ఇక బాలయ్యకు తన100 వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత సరైన విజయం లేదు.

అందుకే ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నారు అభిమానులు. ఇక ఇదిలా ఉంటె ఈ సినిమా తర్వాత బాలయ్య ఏ దర్శకుడితో సినిమా చేయనున్నాడని కొంత కన్ఫ్యూజన్  నెలకొంది.అయితే బాలయ్య ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన తదుపరి సినిమాల గురించి క్లారిటీ ఇచ్చారు. అఖండ తర్వాత క్రాక్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని సినిమా చేస్తున్నాడు బాలయ్య.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది.ఇక ఈ ప్రాజెక్ట్ తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.

ప్రస్తుతం ఎఫ్3 షూటింగ్ లో బిజీగా ఉన్న అనిల్..ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే బాలయ్య సినిమా స్ర్కిప్ట్ పనులను పూర్తి చేయనున్నాడు.ఎఫ్3 షూటింగ్ పూర్తి కాగానే బాలయ్య సినిమాను పట్టాలెక్కించనున్నాడు అనిల్ రావిపూడి.ఇక ఆ తర్వాత పూరీ జగన్నాథ్ తో ఓ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాలయ్య. గతంలో వీరి కాంబోలో పైసా వసూల్ సినిమా వచ్చింది.కానీ అది ఆశించిన విజయం సాధించలేకపోయింది. దీంతో ఈసారి ఓ ఎమోషనల్ డ్రామాను తెరకెక్కించడానికి ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసాడట పూరీ జగన్నాథ్.వీరి కాంబోపై త్వరలోనే అఫిషియల్ అనౌన్సమెంట్ కూడా రానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: