1. ఆకాష్ పూరీ :
ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ తండ్రి దర్శకుడు అయినప్పటికీ ఆకాష్ కు సినీ ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రావడం లేదు . అయితే త్వరలోనే రొమాంటిక్ అలాగే చోర్ బజార్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
2. వైష్ణవ తేజ్:
డెబ్యూ మూవీతో సూపర్ హిట్ అందుకున్న వైష్ణవ తేజ్, త్వరలో మరో నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించనున్నాడు.
3. సంతోష్ శోభన్:
"ఏక్ మినీ కథ " సినిమాతో బాగా పాపులారిటీ ని అందుకున్న యువహీరో సంతోష్ శోభన్. అయితే అంతకు ముందే "సంపత్ నంది పేపర్ బాయ్" తో హీరో గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇక అయితే కొద్దిరోజుల్లోనే " మారుతి మంచిరోజులు వచ్చాయి" అనే సినిమాతో సెట్ పై కనిపించనున్నారు. అంతేకాదు మరో మూడు సినిమాలకు కూడా కమిట్ అయ్యాడు.
4. విశ్వక్ సేన్:
ఫలక్ నామా దాస్ సినిమాతో క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. అంతేకాదు ఈ నగరానికి ఏమైంది అనే సినిమా ద్వారా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పాగల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
5. తేజ సజ్జ:
బాలనటుడిగా 30 సినిమాలకు పైగా నటించి , ఆ తర్వాత సమంత హీరోయిన్ గా వచ్చిన ఓ బేబీ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక జాంబీ రెడ్డి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం హనుమ్యాన్ అలాగే ఇష్క్ సినిమాతో హీరోగా మన ముందుకు వస్తున్నాడు.
6. నవీన్ పోలిశెట్టి:
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ జీవితాన్ని మొదలుపెట్టి హీరో గా విజయాన్ని సాధించిన నటులలో నవీన్ పోలిశెట్టి కూడా ఒకరు. ఈయన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా ద్వారా హీరోగా దర్శనమిచ్చాడు. ఆ తర్వాత జాతిరత్నాలు సినిమాతో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. త్వరలో మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.