2003లో పెద్దల ఆశీర్వదంతో సుజాత అనే ఆమెను శేఖర్ మాస్టర్ పెళ్లి చేసుకున్నాడు.ఈ దంపతులకు విన్నీ అనే కొడుకు, సాహితి అనే కూతురు ఉన్నారు. స్కూల్లో చదివే రోజుల్లో డాన్స్ మీద ఉన్న పిచ్చి ప్రేమతో తండ్రి జేబులో డబ్బులు దోచేసి మరి సినిమాలు చూసేవాడట శేఖర్ మాస్టర్. అందులోను చిరంజీవి సినిమాలంటే ప్రాణం పెట్టి మరి చూసేవాడట. ఆరవ తరగతి చదివే రోజులలోనే తండ్రి చనిపోవడంతో బాగా కష్టపడి చదువుకున్నాడట. డాన్స్ మీద అమితమైన మక్కువతో హైదరాబాద్ వచ్చేసి, రాకేష్ మాస్టర్ దగ్గర చాలా తక్కువ డబ్బుతో డాన్స్ నేర్పమని అడిగాడట. నెలకు 300 ఫీజ్ కట్టేవాడట. ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోలో తన గ్రూప్ లో శేఖర్ మాస్టర్ ని పెట్టుకున్నాడట రాకేష్ మాస్టర్.ఢీ సీజన్ 2లో కొరియోగ్రఫీలో కూడా పెట్టుకున్నారట. అయినా శేఖర్ కు అంతగా పేరు తీసుకొని రాలేదు.
ఇక ఢీ 5షోలో తన టీమ్ లో పాల్గొని శేఖర్ మాస్టర్ విజయం సాధించాడు. ఆ తరువాత సుధీర్ బాబు హీరోగా నటించిన శివ మనసులో శృతి (sms)సినిమా లో కొరియోగ్రఫీ చేసి టాలీవుడ్ లో అడుగు పెట్టాడు. ఒక పాటకు సుమారు లక్షన్నర వరకూ అందుకునే శేఖర్ మాస్టర్ సినిమాలోని మొత్తం పాటలకి సుమారు 10లక్షల వరకూ తీసుకుంటున్నాడట.టివిలో షోస్ కూడా చేస్తున్నందు వలన ప్రతి టివి షో కి రెండున్నర లక్షల వరకూ పారితోషకం అందుకుంటున్నాడట.అయన సుమారు సంవత్సరానికి సుమారు 10కోట్లు సంపాదన ఉంటుంది అని సమాచారం. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్,సమంత అంటే చాలా ఇష్టం అని శేఖర్ చెప్పారట. ప్రభుదేవా తనకు బాగా ఇష్టమైన డాన్సర్ అని తెలిపారట. తనకు కాశ్మిర్ అంటే ఇష్టమైన చోటు అని చెప్పారట. హైదరాబాద్ లోని కృష్ణానగర్ లో శ్రీ గాయత్రీ హైడ్ అపార్ట్ మెంట్స్ లో సుమారు 80లక్షల విలువైన ఫ్లాట్ లో నివాసం ఉంటున్న శేఖర్ మాస్టర్ కి రెండు కార్లు ఉన్నట్లు సమాచారం.