సినిమా పరిశ్రమ అయినా ఎదగాలంటే పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా నిర్మితమవుతూ ఉండాలి. పదిలో ఒక్క సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న కూడా దానికి పదిరెట్లు కలెక్షన్లను సాధిస్తూ సినిమా పరిశ్రమ ను ముందు ముందుకు తీసుకు వెళుతుంది చిన్న సినిమా. ప్రస్తుతం చిన్న సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది అని చెప్పవచ్చు. కరోనా వచ్చిన తర్వాత చిన్న సినిమాలు చేయాలంటే చిన్న తరహా నిర్మాతలు భయపడిపోతున్నారు. పెద్ద సినిమాలకు ఎలాగోలా బిజినెస్ అయ్యి బయట పడతారు కానీ ఎలాంటి స్టార్డమ్ ఉన్న హీరోలు నటీనటులు సాంకేతిక నిపుణులు లేకపోవడం వలన చిన్న సినిమాలకు కరోనా బాగా ఎఫెక్ట్ అవుతుందని వారు నమ్ముతున్నారు.

ఓవైపు ఓటీటీ సంస్థలు క్రేజ్ వున్న పెద్ద పెద్ద నటులు సాంకేతిక నిపుణులు పని చేసిన సినిమాలకు తప్ప చిన్న సినిమాలకు పెద్దగా ఆఫర్లు ఇవ్వడం లేదు. వారు ఎంత ఇస్తే అంతకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో చిన్న సినిమాలు భవిష్యత్తులో చేస్తే నిర్మాత చతికిలబడ్డట్లే అన్న వాతావరణ ఇప్పుడు టాలీవుడ్ లో  నెలకొంది. ఆహా, అమెజాన్ ప్రైమ్ నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలు చిన్న సినిమాలను అసలు పట్టించుకోవట్లేదు అనే మరో వాదన వినిపిస్తుంది ఆహా కొంత వరకు కొనుగోలు చేసిన అతి తక్కువ రేటు చెబుతూ ఉండడంతో వారి శ్రమను ఓ టీ టీ సంస్థలు దోచుకుంటున్నాయని  ఫీలవుతున్నారు నిర్మాతలు.

ఇక భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో అని భయపడుతున్నారు. సినిమా తీయడం ఒక ఎత్తు అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు పక్కన పెడితే ముందు మినిమం బిజినెస్ అవడమే గగనమైపోయింది . కరోనా పుణ్యమా అని చిన్న సినిమాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇంకా సెకండ్ వేవ్ పుణ్యమా అని వాటి స్థానం లేకుండా అయ్యింది.  భవిష్యత్తులో చిన్న సినిమా ఉండదేమో అనిపిస్తుంది. మరి చిన్న సినిమా రెండు బతికించాలటే ఏదైనా ఒక పెద్ద అద్భుత శక్తి దిగి రావాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

OTT