చిత్ర పరిశ్రమలో కొంత మంది నటులు వారి నటన జీవితానికి వారికి ఉన్న పాత పేర్లు సరిపడవని ఆ రంగానికి సూట్ అయ్యే విధంగా పేర్లు మార్చుకొని పరిశ్రమకు పరిచయం అవుతుంటారు. అలా సినీ పరిశ్రమకు  పేరు మార్చుకొని వచ్చిన నటుల గురించి ఒక్కసారి చూద్దామా. ఇక అందులో మొదటగా చిరంజీవి గారిని తీసుకుంటే, స్వయం కృషితో ఎదిగి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఆయన సినీ పరిశ్రమలో ఎంతోమంది నటులకు స్ఫూర్తిగా నిలిచాడు. ఇక చిరంజీవి అసలు పేరు కొణిదెల శివ శంకర వర ప్రసాద్. అంతేకాదు ఆయన మెగా బ్రదర్ గా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి పవర్ స్టార్ గా తన సొంత టాలెంట్ తో ఎదిగిన హీరో పవన్ కళ్యాణ్. ఆయన అసలు పేరు కల్యాణ్ బాబు.

ఇక తమిళ్ స్టార్ హీరో అయిన సూపర్ స్టార్ రజనీకాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. ఆయన సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాక ఆయన అసలు పేరు మార్చుకున్నారు.
అలాగే  విశ్వ నటుడు,లోక నాయకుడు అయిన కమల్ హాసన్ అసలు పేరు పార్థసారథి శ్రీనివాసన్. దక్షిణాది పరిశ్రమలో సింహంగా ప్రసిద్ది చెందిన సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. అయితే ఆయనను తమిళులు సూరియా అని, తెలుగు వారు సూర్య అని పిలుస్తుంటారు. ఇక దక్షిణాది సినిమా పరిశ్రమ అయిన మాస్టర్ దళపతి విజయ్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే విజయ్ అసలు పేరు విజయ్ చంద్రశేఖర్.

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా భారీ గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ అసలు పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి. అలాగే దగ్గుపాటి  వారి వారసుడు అయిన రామానాయుడు మనుమడు అయిన రానా ఇటు హీరోగా,అటు విలన్ గా రాణిస్తున్నాడు.రానా అసలు పేరు రామానాయుడు దగ్గుబాటి అని తాత గారి పేరే పెట్టారు. కానీ రానాగా కుదించారు. అయితే 15 సంవత్సరాల కెరీర్ వ్యవధిలో రజనీకాంత్ అల్లుడు అయిన ధనుష్ ఎన్నో అద్భుతాలు చేశారు. ఇక అనేక అవార్డులను సొంతం చేసుకున్నాడు. అయితే  జాతీయ ఫిల్మ్ అవార్డులు సాధించిన ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు. అంతేకాదు.. సినీ పరిశ్రమలో హీరోయిన్స్ లో కూడా ఇలాగే చాలామంది పేర్లు మార్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: