సాధారణంగా దర్శకులకు కూడా సినిమాల్లో నటించాలని కోరిక ఉంటుంది. దాంతో కొంతమంది దర్శకులు సినిమాలలో అప్పుడప్పుడూ ఏదో ఒక సీన్ లో అలా కనిపించి ఇలా వెళ్లిపోతారు. మరి కొంతమంది దర్శకులు తామే హీరోగా నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పటివరకు వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించినప్పటికి ఒక సినిమాలోనూ ఆయన కనిపించలేదు. వారసత్వం గా నే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ హీరోగా కాకుండా దర్శకుడిగా పరిచయమయ్యారు. ఎన్నో సినిమాలను తీసి తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఎవరో కాదు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు. అయితే ఇప్పుడు ఆయన కూడా స్క్రీన్ పై కనిపించబోతున్నారు. రాఘవేంద్రరావు ప్రస్తుతం హీరో శ్రీకాంత్ సుపుత్రుడు రోషన్ హీరోగా పెళ్లి సందడి సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ హీరోగా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చి అప్పట్లో సెన్సేషనల్ విజయం సాధించిన పెళ్లి సందడి సినిమా కు సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు మరియు పాటలు విడుదల కాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

దాంతో రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి ఒక ఆసక్తికర ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమాలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కూడా కనిపించబోతున్నారు. ఈ మేరకు విడుదలచేసిన వీడియోలో రాఘవేంద్రరావు స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. తెల్ల జుట్టు గడ్డం లుక్ లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయన ఎంతో స్టైలిష్ లుక్ లో  కనిపించడం విశేషం. ఇక ఈ వీడియోను దర్శకధీరుడు రాజమౌళి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వందకు పైగా సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు ఇప్పుడు స్క్రీన్ పై కనిపించబోతున్నారని రాజమౌళి ఈ వీడియోని షేర్ చేశారు. ఇదిలా ఉండగా రాఘవేంద్రరావు ఇండస్ట్రీకి పరిచయం చేసిన నటీనటులు ప్రస్తుతం స్టార్ హీరోలు హీరోయిన్లు గా ఉన్నారు. వాళ్ళలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరు... అంతే కూడా అంతే కాకుండా తాప్సీని కూడా రాఘవేంద్ర రావు పరిచయం చేశాడు. ఇప్పుడు తాప్సీ బాలీవుడ్ లో సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు ఎంతోమంది నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన రాఘవేంద్ర రావు ఇప్పుడు నటుడిగా పరిచయం కాబోతున్నారు. దాంతో ఇప్పుడు దర్శకులంతా రాఘవేంద్రరావు తమ సినిమాల్లో నటించాలని క్యూ కట్టే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: