సాధారణంగా సినిమా క్లైమాక్స్ లో హీరో చనిపోతే , ఆ సినిమా డిజాస్టర్ గా మిగులుతుంది. కానీ ఇక్కడ ఒక సినిమాలో మాత్రం హీరో చనిపోవడంతో సినిమా సక్సెస్ ఫుల్ గా విజయవంతం సాధించింది.ఆ సినిమా ఏదో కాదు చిరంజీవి,విజయ్ కుమార్ కలసి నటించిన చిత్రం స్నేహం కోసం.. ఇక ఈ సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. చూసిన ప్రతి వారి కళ్ల వెంట నీళ్లు తప్పకుండా వస్తాయి. అంతేకాదు స్నేహం అంటే ఇలా ఉండాలి.. అని మనలో మనం అనుకునేలా చేస్తుంది ఈ సినిమా. ఇక స్నేహం అంటే ఎలా ఉండాలి..? ఎలా జీవించాలి..? కడ వరకు కష్టసుఖాల్లో కూడా కలిసి వచ్చేది స్నేహం..!  అని స్పష్టం గా చూపించారు ఈ సినిమాలో..


ఇక ఈ సినిమా విషయానికి వస్తే, 1999వ సంవత్సరంలో కె రవికుమార్ దర్శకత్వంలో శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన చిత్రం స్నేహం కోసం. ఈ చిత్రాన్ని ఏ.ఎం. రత్నం నిర్మించారు. ఇక ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయగా , చిరంజీవి స్నేహితుడిగా ప్రముఖ నటుడు విజయ్ కుమార్ నటించాడు. ఇక హీరోయిన్ గా మీనా నటించింది. సుజాత, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, సితార , నిర్మలమ్మ కోట శ్రీనివాసరావు లు ప్రముఖ పాత్రల్లో నటించారు. అయితే ఈ చిత్రం శరత్ కుమార్, సిమ్రాన్ కలిసి నటించిన తమిళ్ చిత్రం నట్పుక్కాగ చిత్రం నుండి తెలుగులో రీమేక్ చేశారు.


ఇకపోతే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కేవలం ఆస్తి కోసం మాత్రమే తన కూతురు  సితార ను వివాహం చేసుకుంటున్నారు అని తెలుసుకున్న సుజాత, ఈ విషయాన్ని తన భర్త విజయ్ కుమార్ కు చెప్పడానికి వెళ్తుండగా,  ప్రకాష్ రాజ్  ఆమెను కొట్టి పడేస్తాడు. అయితే చిరంజీవి అటుగా వెళ్తున్నప్పుడు , ఆమెను చూసి ఎవరు ఇలా చేశారు అని అడగగా.. తన తమ్ముడు ప్రకాష్ రాజ్ మంచివాడు కాదని, ఆస్తి కోసం మాత్రమే తన కూతురును  వివాహం చేసుకుంటున్నాడు అని చెప్పి, మరణించింది. అయితే ఈ విషయం తెలుసుకొని వెంటనే ప్రకాష్ రాజ్ ను  కొట్టడానికి వెళితే అప్పటికే ప్రకాష్ రాజ్, సితార ను వివాహం చేసుకుంటాడు. ఇక ప్రకాష్ రాజ్ ను  జైలుకు పంపిస్తే, తన మిత్రుడైన విజయ్ కుమార్, సుజాత ల కూతురు సితార అన్యాయం అయిపోతుందని, ఆ నేరాన్ని చిరంజీవి తనపైన వేసుకుని జైలుకు వెళతాడు..


ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా కేవలం తన మిత్రుడైన విజయ్ కుమార్ కు మాత్రమే చెబుతాడు.. అంతే కాదు ఎవరికీ చెప్పవద్దని కూడా ప్రమాణం చేయించుకుంటాడు చిరంజీవి. స్నేహం కోసం త్యాగం చేసి దాదాపు 20 సంవత్సరాల పాటు జైల్లోనే ఉండిపోతాడు. ఇక జైలు నుంచి విడుదలయిన చిరంజీవి, తన మిత్రుడు విజయ్ కుమార్ ని కలుస్తాడు. అలా కొంత సినిమా సాగిన తరువాత, చిరంజీవి కొడుకు చిన్నయ్యకు విజయ్ కుమార్ కూతురు ప్రభావతి  అలియాస్ మీనా కు వివాహం జరుగుతుంది. తర్వాత చిరంజీవి మరణిస్తాడు. మిత్రుడు విజయ్ కుమార్ కూడా మరణిస్తాడు.. ఈ సన్నివేశం చూసిన ప్రేక్షకులకు కన్నీరు తెప్పిస్తుంది. మళ్లీ మళ్లీ చూడాలనిపించే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: