కింగ్ నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయనా మూవీ డైరెక్ట్ చేసిన కళ్యాణ్ కృష్ణ ఆ మూవీ తర్వాత నేల టిక్కెట్టు అని రవితేజతో డిజాస్టర్ మూవీ చేశాడు. ఆ మూవీ తర్వాత డైరక్టర్ అడ్రెస్ లేకుండా పోయాడు. నాగార్జునతో సోగ్గాడే మూవీ ప్రీక్వల్ గా బంగార్రాజుని డైరెక్ట్ చేయాలని చూస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ స్టార్ట్ అవబోతుందని తెలుస్తుంది. ఎలాగు ఖాళీనే కదా అని రియాలిటీ షోని డైరెక్ట్ చేస్తున్నాడు కళ్యాణ్ కృష్ణ.
ఎన్.టి.ఆర్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోని కొంత పార్ట్ ఎన్.టి.ఆర్ డైరెక్ట్ చేస్తున్నారని సమాచారం. అంతేకాదు ఈ షో ప్రోమోలన్నిటిని త్రివిక్రం డైరక్షన్ లో షూట్ చేశారని తెలుస్తుంది. బిగ్ బాస్ తర్వాత ఎన్.టి.ఆర్ చేస్తున్న స్మాల్ స్క్రీన్ షో కాబట్టి ఎవరు మీలో కోటీశ్వరులు మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ షోతో మరోసారి తారక్ తన సత్తా చాటనున్నాడని చెప్పొచ్చు. స్క్రీన్ ఏదైనా యంగ్ టైగర్ రంగం లోకి దిగితే రచ్చ కన్ఫర్మ్ అని ఫిక్స్ అవ్వాల్సిందే. ఇక సినిమాల విషయానికి వస్తే తారక్ ఆర్.ఆర్.ఆర్ తో అదరగొట్టడానికి రెడీ అవగా ఈ మూవీ తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో మూవీ ఫిక్స్ చేసుకున్నాడని తెలిసిందే.