అయితే ఈ సినిమాలో మిజాన్ జాఫ్రీ అనే ఒక బాలీవుడ్ యాక్టర్ కూడా నటించారు. ఆయన పద్మావత్ సినిమాతోనే వెండితెరకు పరిచయమయ్యారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మిజాన్ సంచలన నిజాలను బయటపెట్టారు. పద్మావత్ చిత్రంలోని ఒక సన్నివేశంలో రణ్‌వీర్ నటించాల్సి ఉందని కానీ ఆ రోజు ఆయన రాలేదని మిజాన్ చెప్పుకొచ్చారు. దీంతో ఆ సన్నివేశంలో రణ్‌వీర్ గా తనని నటించాలని సంజయ్ లీలా బన్సాలీ కోరినట్లు ఆయన చెప్పారు. ఆ సమయంలో తాను కాస్ట్యూమ్, మేకప్ ధరించి సెట్స్ లో ఉన్నాను అని గుర్తు చేసుకున్నారు. ఆ సమయం వరకు తాను ఏమీ తినలేదు అని.. దాంతో చాలా నీరసంగా ఉన్నానని ఆయన అన్నారు. అదే తన మొదటి సినిమా కావడంతో ఆయన చాలా ఆందోళనగా ఫీల్ అయ్యారట.
ఆ క్రమంలోనే సంజయ్ లీలా భన్సాలీ తనని రణ్‌వీర్ పాత్రలో నటించాలని చెప్పారట. ఈలోగా అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి రణ్‌వీర్ సన్నివేశానికి సంబంధించిన షాట్, డైలాగ్ చెప్పారట. దీంతో "నాకు ముందే ఎందుకు చెప్పలేదు. నేను ఆల్రెడీ చాలా ఆందోళన పడుతున్నాను" అని ఆయన నిట్టూర్చారట. కానీ సంజయ్ లీలా బన్సాలీ మాత్రం "నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. కచ్చితంగా నువ్వు చేయగలవు" అని ప్రోత్సహించారు. దీంతో చేసేదేమీ లేక ఆయన రణ్‌వీర్ లాగా తయారయ్యే సన్నివేశాన్ని పూర్తి చేసారట.