మహేష్ బాబు హీరోగా సూపర్ పరశురామ్ డైరెక్షన్ లో చిత్రీకరిస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక సర్కారు వారి పాట సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 13వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ నోటీస్ పేరుతో మహేష్ బాబు లుక్ కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ కాగా ఆ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ కానుందని తెలుస్తోంది.

అయితే ఆగష్టు నెల 9వ తేదీన టీజర్ రిలీజ్ కానుండగా 60 సెకన్లకు పైగా నిడివితో ఈ టీజర్ ఉంటుందని తెలుస్తుంది. అంతేకాక.. ఈ సినిమా టీజర్ చివర్లో మహేష్ బాబు చెప్పే డైలాగ్ టీజర్ కు హైలెట్ గా నిలవనుందని తెలుస్తోంది. ఈ సినిమాకి థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరో హైలెట్ గా నిలవనుందని ప్రచారం జరుగుతుంది. అంతేకాక.. మహేష్ బాబు ఫ్యాన్స్ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే సర్కారు వారి పాట టీజర్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇక మహేష్ పుట్టినరోజున మహేష్ తరువాత సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే మహేష్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో, రాజమౌళి డైరెక్షన్ లో మరో సినిమాలో నటించనున్నారు. కాగా.. ఈ సినిమాల షూటింగ్ లు ఎప్పటినుంచి మొదలవుతాయో అనేది అధికారికంగా ప్రకటన రాలేదు.  ఇక వరుస బ్లాక్ బస్టర్ హిట్ల తరువాత మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: