టాలీవుడ్ నటి అయిన పూర్ణ ఎప్పుడు చాలా అమాయికమైన లుక్‌ లో కనిపిస్తు ఉంటుంది. కానీ ఆమెలో కూడా ఓ మాస్‌ యాంగిల్‌ దాగి ఉందట. ఆమె అస్సలు తిరగబడితే ఏవిధంగా ఉంటుందో తెలియాలంటే ఆమె నటిస్తున్న `సుందరి` సినిమా చూడాల్సిందే అంటు  ఈ చిత్ర దర్శకుడు కళ్యాణ్‌ జీ గోగన చెప్పడం జరిగింది.

ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షో లో జడ్జ్ గా పూర్ణ అమాయికంగా ఉంటూ హాట్ లుక్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది. డాన్స్ షోలో ఆమె చేసే సందడి మాత్రం అందరిని బాగా కనువిందు చేస్తుంది. జనరల్‌గా పూర్ణ సినిమాలలో మంచి క్యూట్ లుక్స్ తో కనిపిస్తుంటుంది. కానీ ఆమెలో కూడా ఓ మాస్‌ యాంగిల్‌ ఉంది. ఆమెలో కూడా ఓ రెబల్‌ దాగి ఉన్నాడట.ఆమె అస్సలు తిరగబడితే ఏవిధంగా ఉంటుందో తెలియాలంటే `సుందరి` సినిమా చూసి తీరాల్సిందే అంటున్నారు ఈ చిత్ర దర్శకుడు అయిన కళ్యాణ్‌ జీ గోగన. పూర్ణ మరియు అర్జున్‌ అంబటి ఇంకా రాకేందు మౌళి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమా `సుందరి`. ఈ సినిమాను రిజ్వాన్‌ నిర్మించడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతుందట. ఈ నెల 13న థియేటర్లో విడుదల కాబోతున్నట్లు సమాచారం.

ఈ సందర్భంగా విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్‌ అందరిని బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో పూర్ణ చాలా అమాయకంగా కనిపిస్తూ ఉంటూ భర్త చేసే టార్చర్‌ కారణంగా కొంత మంది మగవాళ్లు తనని చూసే తప్పుడు దృష్టి కారణంగా ఆమెకు అనుకోని సంఘటనలు తన జీవితంలో ఎదురైతే ఆమె ఎలా తిరగబడిందనే నేపథ్యంతో ఈ చిత్రం రూపొందిందని ట్రైలర్‌ చూస్తే తెలుస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో పూర్ణ చాలా బోల్డ్ గా కనిపించారట. కొన్ని సన్నివేశాల డిమాండ్‌ మేరకు ఆమె చాలా అందాల విందు కూడా చేయాల్సి వచ్చిందట.

ఈ సినిమాపై పూర్ణ మాట్లాడుతూఓ పెద్ద రేంజ్‌ ఉన్న హీరోయిన్లు చేయవలసిన సినిమా ఇది. అంత పెద్ద రేంజ్‌ ఉన్న హీరోయిన్‌ నేను కాకపోయినా, నాతో ఈ సినిమా చేసిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలని తెలిపారు. ఈ సినిమాలో తన పాత్రకి తాను న్యాయం చేశానని తన సినిమా కెరీర్‌లో బెస్ట్ పాత్ర అవుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా సినిమా బృందానికి ధన్యవాదాలు తెలిపింది పూర్ణ. తాను నటించబోయే మరో సినిమా కూడా దర్శకుడు కళ్యాణ్‌ జీ గోగన దర్శకత్వంలో చేస్తున్నట్టు తెలిపిందట. ఈ కార్యక్రమంలో దర్శకుడు కళ్యాణ్‌ జీ గోగన, నిర్మాత అయిన రిజ్వన్‌ మరియు మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయిన సురేష్‌ బొబ్బిలి అలాగే నటుడు రాకేందు మౌళిమరియు హీరో అర్జున్‌ అంబటి వంటి వారు పాల్గొని ఈ సినిమా విశేషాలను పంచుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: