క్రేజీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం జానపద పాటలకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. అలవైకుంఠపురం చిత్రంలోని పాటలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ నే కాదు.. యావత్ ప్రేక్షకులను అలరించాయి. ఎవరినోట చూసినా రాములో రాములా పాట వినిపిస్తోంది. అంతేకాదు సిత్తరాల సిరపడు పాటకు కూడా మంచి ఆదరణ లభించింది. అరవింద సమేతలో రెడ్డమ్మ పాట సినీ జనాలను తెగ ఆకట్టుకుంది. ఇక తమన్ కూడా ఏం తక్కువ కాదు.. వరుడు కావలెను చిత్రంలో దిగు దిగు.. దిగు నాగన్న అనే పాటకు మంచి రెస్పాన్సే వచ్చింది. ఈ సినిమాలో నాగశౌర్య, రీతూ వర్మ నటిస్తున్నారు.
ఇక 'లవ్‌స్టోరీ' సినిమాలో సుద్దాల అశోక్‌తేజ్ రాసిన సారంగదరియా పాట అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించింది. మంగ్లీ వాయిస్ కు తోడు సాయి పల్లవి డ్యాన్స్ తో పాటకు ఊపొచ్చింది. ఇంకేముందీ 298 మిలియన్స్‌కి పైగా వ్యూస్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. డిజిటల్ వరల్డ్‌లో ఎక్కువగా హంగామా చేస్తోన్న పాట 'నాదీ నక్కిలీసు గొలుసు'. ఎన్నాళ్ల నుంచో జనాల నోళ్లలో ఉన్న ఈ పాటని వెండితెరపైకి తీసుకొచ్చాడు రఘు కుంచె. 'పలాస 1978' సినిమాలో ఈ పాటని రీ క్రియేట్ చేశాడు రఘు కుంచె. టిక్‌టాక్‌తో మరింత ఫేమస్ అయిన ఈ పాట, టిక్‌టాక్ బ్యాన్ అయ్యాక కూడా సందడి చేస్తూనే ఉంది.
మిక్కీ.జే.మేయర్ 'శ్రీకారం' కోసం ఫోక్ స్టైల్‌లో 'భలేగుంది బాలా' అనే పాట కంపోజ్ చేశాడు. పెంచల్ దాస్ రాసి, పాడిన ఈ పాట సూపర్‌హిట్ అయ్యింది. నాని 'క్రిష్ణార్జున యుద్ధం' సినిమా అంతగా ఆడలేదు. అయితే ఈ సినిమాలోని 'దారిచూడు దుమ్ముచూడు' మామ పాట మాత్రం సూపర్ హిట్ అయ్యింది. పెంచల్ దాస్ రాసి పాడిన ఈ పాట ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్‌తో స్టెప్పులేయిస్తూనే ఉంది. మొత్తానికి జానపద గేయాలు సినిమాలకు మంచి ఊపుతెస్తున్నాయి. ఇలాంటి ఒరవడి ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో చూద్దాం..