
ఇక అవే సినిమాలు టీఆర్పీలో కూడా రికాకర్డులు క్రియేట్ చేశాయి. అయితే సమ్మర్ లో వరుసగా సినిమాలు రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉండగా మళ్లీ కరోనా విజృంభించడంతో పలు సినిమాలు వాయిదా పడడమో లేదా ఓటీటీలకు వెళ్లిపోవడమో జరిగింది. ఇక ఈ యేడాది వచ్చిన సినిమాలలో ఏయే సినిమాలు బుల్లితెరపై టాప్ టీఆర్పీ రేటింగులతో దుమ్ము రేపాయో చూద్దాం. జూలై నెలాఖరకు చూస్తే బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమా 6.92 రేటింగ్ తో 8వ స్థానంలో ఉంది. ఇక నితిన్ రంగ్ దే 7.22 రేటింగ్‌తో 7వ స్థానంలో ఉంది.
ఇక 6వ స్థానంలో 7.51 రేటింగ్ తో అల్లరి నరేష్ కంబ్యాక్ మూవీ నాంది నిలిచింది. జాంబి రెడ్డి సినిమా 8.1 రేటింగ్ తో 5వ స్థానంలో నిలిచింది. ఇక నితిన్ చెక్ మూవీ 8.53 రేటింగ్‌తో 4వ స్థానంలో నిలిచింది. నితిన్ రెండు సినిమాలు ఈ యేడాది మంచి రేటింగ్ సాధించాయి. ఇక టాప్ -3లో 3 వ ప్లేస్ లో రవితేజ క్రాక్ సినిమా 11.71 రేటింగ్ ను సొంతం చేసుకుంది.
ఇక వైష్ణవ్ తేజ్ ఉప్పెన 18.51 రేటింగ్‌తో రెండో స్థానంలో ఉంది. ఇక టాప్ ప్లేసులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్‌సాబ్ సినిమా నిలిచింది. వకీల్ సాబ్ సినిమా 19.12 రేటింగ్ ను సొంతం చేసుకుంది.