క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’. ప్రకృతి ప్రియమైన ఈ ‘శాకుంతలం’ చిత్రం ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ కాగా, ఇందులో లీడ్ రోల్‌ను అక్కినేని కోడలు సమంత ప్లే చేస్తోంది. కాగా, ఈ చిత్రం ద్వారా అల్లు వారి కుటుంబం నుంచి మరొకరు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. వారు ఎవరంటే?... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ. ఈ చిత్రంలో అర్హ భరతుడి పాత్ర పోషిస్తుంగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో మూవీ షూటింగ్ జరుగుతోంది. 


ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్ తన కూతురి యాక్టింగ్ ఎలా ఉండబోతుందో? లైవ్‌గా చూసేందుకుగాను సెట్స్‌ వద్దకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో బన్ని దంపతుల ‘శాకుంతలం’ సెట్ విజిట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సెట్‌లో కాసేపు కూర్చొని కొన్ని సీన్స్ చూసిన బన్ని కూతురి యాక్టింగ్ చూసి హ్యాపీగా ఫీలయ్యాడు.

 ఈ చిత్రంలో దుష్యంతుడి పాత్రను మలయాళ హీరో దేవ్ మోహన్ పోషిస్తున్నారు. మహాభారత గాధ ఆదిపర్వంలోని శకుంతల-దుష్యంతుడు మధ్య సాగిన ప్రేమాయణం ఆధారంగా చిత్రం తెరకెక్కుతోంది. సమంత చేస్తున్న తొలి పౌరాణిక, చారిత్రక పాత్ర ఇదే. ఈ చిత్రానికి దిల్ రాజు సమర్పకులుగా ఉండగా, డీఆర్పీ- గుణా టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. బన్ని ప్రస్తుతం ‘పుష్ప’ ఫిల్మ్ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. రెండు పార్ట్స్‌గా ‘పుష్ప’ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. 


ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కథ ఉండబోతున్నదని తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రంలో విలన్‌గా మలయాళం టాలెంటెడ్ హీరో ఫాహద్ ఫజిల్ నటిస్తుండగా, అల్లు అర్జున్ సరసన క్యూట్ బ్యూటీ రష్మిక మందన నటిస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన గిరిజన యువతిగా ఆమె పాత్ర వైవిధ్యంగా ఉండబోతున్నదని సమాచారం. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: