కాగా, ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమవుతాడు నరేశ్. ‘సభకు నమస్కారం’ ఫిల్మ్ షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. మహేశ్ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తుండగా, సతీష్ మల్లంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ ప్లస్ సీరియస్ పొలిటీషియన్ పాత్రను నరేశ్ పోషించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇకపోతే నరేశ్ గతంలో మాదిరిగా కామెడీ సినిమాలు కూడా చేస్తారట. కానీ, అవి కూడా సబ్జెక్ట్ ఓరియెంటెడ్ అయితేనే అనే కండిషన్ పెట్టాడని తెలుస్తోంది.
ఇటీవల కాలంలో నరేశ్ నటించిన కామెడి యాంగిల్ మూవీస్ ‘సెల్ఫీ రాజా, మేడ మీద అబ్బాయి, సిల్లీ ఫెల్లోస్, బంగారు బుల్లోడు’ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ క్రమంలోనే వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో వచ్చిన సూపర్ స్టార్ మహేశ్‌బాబు ‘మహర్షి’ చిత్రంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు నరేశ్. మహేశ్‌కు స్నేహితుడిగా ఈ సినిమాలో గుడ్ సపోర్టింగ్ యాక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు నరేశ్. ఈ నేపథ్యంలోనే సీరియస్ రోల్స్ బాగా ప్లే చేయగలడు నరేశ్ అని నమ్మకాన్ని క్రియేట్ చేశాడు హీరో నరేశ్. ఇక ‘నాంది’ చిత్రంలో నరేశ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ‘సభకు నమస్కారం’ మూవీ ద్వారా మరో ప్రయోగం చేయబోతున్నాడు నరేశ్.