దేశ భక్తిని చాట్ సినిమాలు ఎన్నో వచ్చాయి. అయితే దేశ భక్తి గురించి ఎన్ని సినిమాలు వచ్చినాగాని ప్రజలు వాటిని ఆదరిస్తూనే ఉంటారు. ఇప్పుడు అలాంటి దేశ భక్తి గురించి, దేశాన్ని రక్షించే క్రమంలో ఒక వీర జవాన్ తన ప్రాణాలను సైతం విడిచిన కథతో వచ్చిన చిత్రమే షేర్షా.ఇప్పుడు.బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు అన్ని బాషల వాళ్ళకి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. సోషల్ మీడియాలో సైతం షేర్షా సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్ యంగ్ స్టార్ సిద్దార్థ్ మల్హోత్ర మరియు కియారా అద్వానీ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో కాకుండా డైరెక్టర్  అమెజాన్ ప్లాట్ ఫార్మ్ లో రిలీజ్ అయ్యింది. దేశ భక్తిని చాటి చెప్పే చిత్రాలెన్నో వచ్చాయి. దేశ రక్షణ కోసం అమరుడైన వీర జవాన్ విక్రమ్ భాత్రా యొక్క జీవిత చరిత్ర ఆధారంగా షేర్షా సినిమాను తెరకెక్కించారు మన దర్శకుడు విష్ణు వర్ధన్. అంచనాలకు తగ్గట్టుగా సినిమా గురించి అందరిలో హైప్ పెరిగిపోయింది. 


ఈ సినిమాను తెరకెక్కించిన విధానంను చూసి అందరిలో ఈ సినిమాను డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నిజానికి ఈ బాలీవుడ్ చిత్రాన్ని తెరకెక్కించింది మన సౌత్ దర్శకుడు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈయన తెలుగు లో పవన్ కళ్యాణ్ తో నటించిన పంజా సినిమాకు డైరెక్టర్ గా చేసారు.కానీ సినిమా అయితే స్టైలిష్ గా ఉంది కానీ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వకపోవడంతో ప్లాప్ లిస్ట్ లో చేరిపోయింది. 


ఆ తరువాత తెలుగులో సినిమాలు చేయలేదు. తమిళంలో మాత్రం కొన్ని సినిమాలు తెరకెక్కించారు. ఆ తర్వాత బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్ దక్కించుకుని  షేర్షా మూవీని తీసాడు. సినిమా మొదటి నుంచి చివర వరకు ఎక్కడ ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా, ఆద్యంతం ఎంతో ఉత్కంఠ భరితంగా తీశారు. ఈ సినిమా డైరెక్ట్ చేసిన విధానం చూసి అందరు కూడా డైరెక్టర్ విష్ణు వర్ధన్ ను అభినందిస్తున్నారు. ఈ సినిమా విజయంతో మరిన్ని ఆఫర్స్ విష్ణు వర్ధన్ కు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ బాలీవుడ్ మూవీతో విష్ణు వర్ధన్ దశ తిరిగిపోయిందనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: