హీరోయిన్ శ్రీదేవి ఉత్తర, దక్షిణాది సినిమాలలో నటించి సంచలన విజయాలను అందుకున్న నటి ఈమె.నటన పరంగా ఈమె తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా తనదైన ముద్ర వేసుకుంది. కానీ ఈమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సమయంలోనే మరణించడం అందరినీ చాలా బాధకు గురి చేసింది. 2018 వ సంవత్సరంలో ఫిబ్రవరి 24న దుబాయ్ లో ఒక ప్రముఖ హోటల్లో మరణించింది.

కానీ  ఈమె ఎలా చనిపోయిందనే విషయం ఇంకా అభిమానుల్లో అనుమానంగానే మిగిలింది. అంతేకాకుండా శ్రీదేవికి దుబాయిలో ఆమె పేరు మీద  ఇన్సూరెన్స్  ఉండడంతో.. అందుకోసమే తను మరణించిందని అప్పట్లో ఎన్నో కథలుగా వెలువడ్డాయి. కానీ శ్రీదేవి భర్త బోనీకపూర్ మాత్రం తన చనిపోయేముందు చాలా ఆస్తి ఉన్నదట. ఎంత ఆస్తి ఉందనే విషయం పై అప్పట్లో శ్రీదేవి అభిమానులలో ఎక్కువగా చర్చ సాగింది.

ఒక ప్రముఖ మీడియా తెలిపిన ప్రకారం శ్రీదేవి చనిపోయే  సమయంలో మొత్తం ఆస్తి విలువ..$ 32 మిలియన్లు ఉన్నదట. అంటే సుమారుగా..250 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఆస్తి తన భర్త తో కూడా కలిపి ఉన్నదట. ఇక అంతే కాకుండా శ్రీదేవికి ఎన్నో ఖరీదైన కార్లు కూడా ఉండేవట. ఇక భర్త బోనీ కపూర్తో కలిసి వివిధ ప్రాంతాలలో వివిధ పెట్టుబడులు పెట్టారట. అయితే ఆమె మరణించడం వెనుక ఏదో రహస్యం ఉన్నట్లు అప్పట్లో ఊహాగానాలు వచ్చాయి.

అంతేకాకుండా మరణించే ముందు ఆల్కహాల్ తీసుకుందనే వార్త ఎక్కువగా వినిపించింది. కానీ ఆమె పోస్టుమార్టర్ రిపోర్టు ప్రకారం.. ఆమె ఊపిరితిత్తులలో నీరు ఉందని తేలింది. ఆమె ప్రమాదవశాత్తు మునిగి పోవడానికి కారణం మధ్యమే అన్నట్లు టాక్సికాలజీ వెల్లడించింది. ఆ సమయంలో తన కూతురు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న సమయంలోనే ఇలాంటి ఘటన  జరగడంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: