వచ్చేనెల వినాయకచవితి రాబోతోంది. వినాయకచవితి వచ్చింది అంటే చాలు వాడవాడలా వినాయకుడి బొమ్మల హడావిడి కనిపిస్తుంది. అయితే అత్యంత భారీ స్థాయిలో చాల ఎత్తుగా తయారు అవుతున్న ఈ రంగురంగుల వినాయక విగ్రహాల నిమజ్జనం వల్ల పర్యావరణం దెబ్బ తింటుంది అని చెపుతున్నప్పటికీ ఎవరు పట్టించుకునే స్థితి లేదు.


ప్రస్తుతం ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వాలు క్లే ఆర్ట్ ని ఎంకరేజ్ చేస్తున్నాయి. అందమైన మట్టి గణపతి రూపాలతో గణపతిని ఆరాధించమని ప్రభుత్వాలు స్వచ్చంద సంస్థలు మీడియా వర్గాలు చేస్తున్న ప్రచారానికి తోడుగా అల్లు అర్జున్ కూతురు అర్హ కూడ తోడైంది. తన చేతితో అందమైన మట్టి వినాయక విగ్రహాలను తయారు చేస్తూ అర్హ చాల బిజీగా కనిపిస్తోంది.

ఈ మధ్యనే ‘శాకుంతలం’ మూవీ షూటింగ్ లో పాల్గున్న అర్హ తన ప్రతిభతో దర్శకుడు గుణశేఖర్ ను మెప్పించిందట. తాను నటిస్తున్న మూవీ పాత్ర షూటింగ్ పూర్తి అయినప్పటికీ ఆ షూటింగ్ స్పాట్ నుండి బయటకు రావడానికి అర్హ చాల బాధ పడిందట. ఇంత చిన్న వయసులో నటన పట్ల ఆమె చూపించిన ఏకాగ్రతకు యూనిట్ సభ్యులు షాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.


వినాయక విగ్రహం తయారు చేస్తూ గులాబీ షర్ట్ ధరించిన అర్హ తనకు మట్టి అంటకుండా పైన యాప్రాన్ నిపెట్టుకుంది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోకు వేల సంఖ్యలో లైక్ లు వస్తున్నాయి. అల్లరితో పాటు అర్హలో ఉన్న క్యూట్ నెస్ కు బన్నీ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ప్రపంచం గర్వించే సైంటిస్ట్ గా తన కూతురు తయారు కావాలని బన్నీ కోరుకుంటూ ఉంటే ప్రస్తుతానికి అర్హ మాత్రం సినిమాల పట్ల బాగా ఆశక్తి కనపరుస్తోంది. సోషల్ మీడియాలో బన్నీతో సమానంగా ఫాలోయర్స్ ను పెంచుకుంటున్న అర్హ కొంతకాలానికి బన్నీ ఫాలోయర్స్ సంఖ్యను దాటిపోయినా ఆశ్చర్యం లేదు..  


మరింత సమాచారం తెలుసుకోండి: