
ఈ మధ్య కాలంలో ఇలాంటి వివాదాలు ఎక్కువగానే చోటుచేసుకుంటున్నాయి. మొన్నామధ్య ఒక పాట మీద కూడా ఇలానే చేశారు. క్రేజీ అంకుల్ సినిమాపై కూడా ఇప్పుడు అలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ సినిమా కామెడీ పరంగా బాగున్నా మహిళల పట్ల కించపరిచే విధంగా ఉన్నట్లు.. అయితే ఇలాంటి సినిమాలు చూడడం వల్ల కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టుకోవాల్సి వస్తుంది.. అనే ఉద్దేశంతోనే, ఈ సినిమాని.. ఆపివేయాలని మహిళా సంఘం వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇక మహిళలు మాట్లాడుతూ.. సినిమాల ద్వారా మంచి చేయకున్నా పర్వాలేదు. కానీ ఇలాంటి అసభ్యకరమైన సినిమాలు చేయడం వల్ల సమాజం చెడిపోతుంది.. అంటూ విజ్ఞప్తి చేసుకుంటున్నారు. ఈ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను తీసివేయాలని కూడా, మహిళా సంఘాల అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అలాగే సినిమా ఆడాలి అనుకుంటే , ఈ సినిమాని థియేటర్లో ఆడనిచ్చేది లేదు అని తెలియజేస్తున్నారు.
ఇక ఇందులో శ్రీముఖి మెయిన్ పాత్రలో నటిస్తూండగా.. మరొక నటుడు రాజా రవీందర్, తనికెళ్ళ భరణి, మనో, పోసాని , కృష్ణ మురళి కూడా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాకి బడా నిర్మాత బండ్ల గణేష్ కూడా ఒక పాత్రలో కనిపించాడు. అయితే విడుదల అయిన ఈ సినిమా తో , ఇప్పుడు ఈ విషయం పై చర్చనీయాంశంగా మారింది సోషల్ మీడియాలో. అందుకే ఎలాగైనా సరే మహిళలను కించ పరుచు కోకుండా ఉండేందుకు, సినిమా మేకర్ వారు అసభ్యకరమైన సన్నివేశాలు తొలగిస్తే చాలా బాగుంటుంది అని మహిళా సంఘాల వారు కోరుకుంటున్నారు.