టాలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్‌ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  బుచ్చి బాబు దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా వచ్చిన ఉప్పెన సినిమా తో హీరోయిన్‌ కృతి శెట్టి క్రేజ్‌ మాములుగా పెరగలేదు.  చేసిన మొదటి సినిమా తో హీరోయిన్‌ కృతి శెట్టి రేంజ్‌ ఎక్కడికో పోయింది. ఈ సినిమా దెబ్బకు టాలీవుడ్‌ దర్శకులు కృతి శెట్టి డేట్స్‌ ఎగబడుతున్నారు.  ఉప్పెన హిట్‌ తో ప్రస్తుతం హీరోయిన్‌ కృతి శెట్టి.. మరో మూడు సినిమాలు చేస్తున్నారు. టాప్‌ హీరోలు నాని, సుధీర్‌ బాబు మరియు రాంచరణ్ సినిమాల్లో ఛాన్స్‌ కొట్టేసింది ఈ భామ.

వరుస సినిమా లతో పాటు రెమ్యూనరేషన్‌ ను కూడా ఈ భామ పెంచేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే.. ఇది ఇలా ఉండగా... ఈ స్టార్‌ హీరోయిన్‌ కృతి శెట్టి.. మొదటి సారిగా ఓ సీరియల్‌ కు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా మారారు.  అదేంటి హీరోయిన్‌ సీరియల్స్‌ కు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా మారడమేంటని అనుకుంటున్నారా..? అవును ఇది నిజమే. జీ తెలుగు ఛానల్‌ లో ప్రసారం అవుతున్న  ''ముత్యంమంతా ముద్దు'' సీరియల్‌ కు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా వ్యవహరించింది కృతి శెట్టి.

అంతేకాదు....  ఈ సీరయల్‌ అలనాటి హీరోయిన్‌... ఆమని కూడా ఈ 'ముత్యంమంతా ముద్దు'' సీరియల్‌ లో  దర్శన మివ్వనుంది. ఈ సందర్భంగా నటి ఆమని మాట్లాడుతూ..  మొదటి సారిగా సీరియల్‌ లో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.  ఈ సీరియల్స్‌ ద్వారా... తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతానని తెలిపింది ఆమని.   ప్రస్తుతం యువత ఆలోచన ల గురించి ఈ సీరియస్‌ సాగుతుందని...  సమాజం లో మార్పు తీసుకువచ్చేందుకు ఈ సీరియల్‌ ఉపయోగపడుతుందిని వివరించారు. కాగా.. నటి ఆమని కూడా కార్తికేయ హీరోగా చేసిన చావు కబురు చల్లగా సినిమా లో నటించిన సంగతి తెల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: