గత కొద్ది నెలలుగా ఎవరైతే మా మూవీ అసోసియేషన్ ఆర్టిస్ట్ అధ్యక్ష పదవికి, ఎన్నికల బరిలో దిగుతున్నారో వారు సై అంటే సై అంటూ పోటీకి దిగిన విషయం ప్రతి రోజూ చూస్తూనే ఉన్నాం. సెలబ్రిటీలు కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ ఉన్నారు. ఇక పలు సెలబ్రిటీలతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూసిన ఆ రోజు రానే వచ్చేసింది.. గత కొద్ది నెలల నుంచి ఎదురుచూస్తున్న సినీ ప్రేక్షకులు, ప్రస్తుతం అసలు సిసలు అయిన మా రాజకీయం అంటే ఎలా ఉంటుందో చూడబోతున్నారు. ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించి కొంతమంది పెద్దలు మీటింగు ఏర్పాటు చేసుకున్నారు.ఇందులో మోహన్ బాబు, కృష్ణంరాజు, మురళీమోహన్ వంటి తదితరులు భేటీ అయి ఎన్నికల విషయం గురించి అలాగే ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలి..? అనే విషయం గురించి చర్చించుకున్నట్లు సమాచారం.

ఈ మీటింగ్ లో కూడా కొంతమంది వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరితే,  మరికొంతమంది కరోనా ను దృష్టిలో పెట్టుకొని ఇంకొంతకాలం ఆగడం మంచిది అని కోరుతున్నారు. అంతే కాదు ఇందులో పలువురు ప్రముఖులు కూడా ఒక్కొక్కరు ఒక్కో తేదీలను చెప్పడం గమనార్హం. సెప్టెంబర్ లో కానీ, అక్టోబర్ లో కానీ ఎన్నికలు నిర్వహించాలని అడిగినట్లు సమాచారం . ఇక ఈ నేపథ్యంలోనే మరో నాలుగైదు రోజుల్లో ఎన్నికల తేదీని ఫిక్స్ చేస్తామని సీనియర్ నటుడు మురళీ మోహన్, కృష్ణంరాజు తెలిపారు.

అయితే కొంతమంది ప్రముఖులు గొడవలు ఆగాలి అంటే వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరడంతో, అతి తక్కువ సమయంలోనే ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం. ఎన్నికల విషయంలో సామాజిక భౌతిక దూరం పాటిస్తూ, ప్రభుత్వ అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సెప్టెంబర్ రెండవ వారం లేదా అక్టోబర్ రెండవ వారం లోపల ఏదైనా ఒక మంచి తేదీని నిర్ణయిం,చి ఎన్నికలు నిర్వహించాలని పలువురు సినీ పెద్దలు ఒక అభిప్రాయానికి వచ్చారని తెలుస్తోంది. ఇకపోతే అసలు రాజకీయాన్ని ప్రజలు చూశారు ..ఇక మా రాజకీయాన్ని కూడా త్వరలోనే సినీ ప్రేక్షకులు చూడబోతున్నారు అంటూ సినీ ఇండస్ట్రీ వర్గాల పెద్దలు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: