బాలీవుడ్ సినిమాలన్నీ కొత్త పంథాలో వెళుతున్నాయి. మాస్ లేదు.. యాక్షన్ లేదు..ఇప్పుడంతా భక్తి. ఈ రూట్ ను ఎంచుకొని సినీ అభిమానులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్తున్నాయి. ఉత్తరాదిన నితీష్ తివారి రామాయణాన్ని మూడు భాగాలుగా త్రీడీలో తెరకెక్కించబోతున్నాడు. 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది ఈ చిత్రం. అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్‌ మల్హోత్రా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తాడనీ.. హృతిక్ రోషన్‌ రావణాసురుడిగా కనిపిస్తాడని సమాచారం అందుతోంది.

రామాయణ గాథ నేపథ్యంలో వస్తోన్న మరో సినిమా చిత్రం 'సీత'. అయితే ఈ కథని సీత కోణంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు దర్శకుడు అలౌకికా దేశాయ్. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 'మగధీర, బాహుబలి' లాంటి బ్లాక్‌బస్టర్స్‌కి కథ అందించిన కె.విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి కథ, స్క్రీన్‌ ప్లే రాసుకుంటున్నాడు అలౌకికా దేశాయ్.

ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో రామాయణగాథ తెరకెక్కిస్తున్నాడు ఓం రౌత్‌. వాల్మీకి రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న 'ఆదిపురుష్‌'లో ప్రభాస్‌ రాముడిగా నటిస్తోంటే, సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. మహాభారతాన్ని మలుపుతిప్పిన ద్రౌపది పాత్ర నేపథ్యంలో ఒక సినిమా రాబోతోంది. దీపిక పదుకొణే ద్రౌపదిగా నటించబోతోంది. ఇక ఈ సినిమాని మధు మంతెన, దీపిక పదుకొణే సంయుక్తంగా నిర్మిస్తారని తెలుస్తోంది.

మహాభారతంలో అత్యంత ముఖ్యమైన పాత్ర కర్ణుడు. మళయాళ దర్శకుడు ఆర్.ఎస్.విమల్ కర్ణుడి పాత్రతో 'సూర్యపుత్ర మహావీర కర్ణ' అనే సినిమా తీస్తున్నాడు. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలకాబోతోంది. మొదట తమిళ హీరో విక్రమ్‌ కర్ణుడిగా నటిస్తాడనే అనౌన్స్‌మెంట్ వచ్చింది. అయితే లాక్‌డౌన్‌ తర్వాత జరిగిన మార్పులతో విక్రమ్ తప్పుకున్నాడు. మహాభారతంలో ద్రోణాచార్యుడి కొడుకు అశ్వథ్థామకి మరణం లేదని పురాణ గాథ. ఈ కథనే విక్కీ కౌశల్‌ హీరోగా మూడు భాగాల్లో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ఆదిత్యాధర్. ఈ సినిమా కోసం విక్కీ కౌశల్ యుద్ధ విధ్యల్లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఎప్పుడూ.. మాస్.. యాక్షన్ హీరోలుగా చూసిన హీరోల అభిమానులు.. ఆధ్యాత్మిక భావనలో మునిగితి తేలతారో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: