ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టాలీవుడ్ హీరో ప్రశంసల వర్షం కురిపించారు. వైస్సార్సీపీ పార్టు పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని కొనియాడారు. ఏపీలో  జగన్ పాలన చాలా బాగుందని యంగ్ అండ్ డైనమిక్  హీరో అడవి శేష్ అన్నారు. తాజాగా అడవి శేష్ విశాఖపట్నంలో  జరిగిన దిశ యాప్ మీద అవగాహన సదస్సులో పాల్గొన్నారు. దిశా యాప్ వలన ఆడవాళ్ళకి ఎటువంటి భయం లేదని అన్నారు.జగన్ గారి నేతృత్వంలో ఆడవాళ్ళ భద్రతను దృష్టిలో పెట్టుకుని రుపొంచిందిన ఈ ‘దిశ’ యాప్ మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.ఇలాంటి ఒక యాప్ ను మహిళలకు అండగా తీసుకునివచ్చిన జగన్ పాలన అందరికి ఆదర్శనీయకముగా ఉందని చెప్పుకొచ్చారు.

 దిశా యాప్ ఉంటే చాలు భద్రత ఆడవాళ్ళ వెంటనే ఉంటుందని అడవి శేష్ అన్నారు.అలాగే ప్రతి ఒక్క మహిళ కూడా వారి ఫోన్లో దిశా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు .దిశా యాప్ ద్వారా ఏపీ ప్రభుత్వం మహిళలకు అండగా ఉందని అన్నారు.మహిళపై జరిగే అత్యాచారాలను ఎదుర్కోవడానికి ఏపీ ప్రభుత్వం దిశా అనే యాప్ ద్వారా వారికి రక్షణగా నిలుస్తుంది అని అన్నారు. అలాగే మహిళల రక్షణ కోసం ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించడం నిజంగా అద్భుతం అని అన్నారు.ఈ దిశా యాప్ ప్రచారంలో భాగంగా ననేను కూడా ఒక భాగస్వామిని అయినందుకు గర్వపడుతున్నాను అని చెప్పుకొచ్చారు.

 ఇప్పటిదాకా నేను తెరవెనుక ఒక హీరోను మాత్రమే అని, కానీ ఈరోజు నుంచి నేను కూడా ప్రజలలో సామాజిక చైతన్యం పెంపొందించే ఒక బాధ్యత కలిగిన హీరోనని అడవి శేష్ అన్నారు. ఇక అడవి శేష్ సినిమాల విషయానికి వస్తే డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చారు. ప్రస్తుతం అడవి శేష్  ‘మేజర్’ అనే సినిమాలో నటిస్తున్నారు.త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ముంబై దాడుల్లో తన ప్రాణాలను సైతం పళంగా పెట్టి శత్రువులతో పోరాడి  ఎంతో మంది ప్రాణాలు కాపాడిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘మేజర్’


మరింత సమాచారం తెలుసుకోండి: