గత కొన్ని దశాబ్దాలుగా తన అద్భుతమైన నటన తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ,ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించి తెలుగు సినీ పరిశ్రమలో తన కంటూ ఒక పేరును ఏర్పరుచుకున్న గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు. ఇలా ఎంతో మంది దర్శక ,నిర్మాతలతో పెద్ద పెద్ద స్టార్ హీరోలతో నటించిన కోట శ్రీనివాస రావు ఒక విషయం గురించి తాజాగా ఓపెన్ అయ్యారు. ఆయన తన నట ప్రస్థానం గురించి మాట్లాడుతూ అందులో జరిగిన ఒక సంఘటనను వివరిస్తూ దర్శకుడు కృష్ణవంశీ పై చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. కృష్ణవంశీ ఒకసారి ఒక వేదికపై మాట్లాడుతూ తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు తక్కువ అయ్యారు అనడానికి కారణం ప్రకాష్ రాజ్ కు ఒకే సంవత్సరం రెండు నందులు రావడమే అని అన్నాడు. దానిని నేను తీవ్రంగా ఖండించాను.

 ముందు నువ్వు సారీ చెప్పు అని అన్నాను. నంది వస్తే సరిపోతుందా. చిరంజీవి లాంటి గొప్ప నటులు ఎంతమంది ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన నటులు కూడా తెలుగు ఇంట్రెస్ట్ లో చాలామంది ఉన్నారు. నంది అవార్డులకు కొన్ని రూల్స్ ఉంటాయి. కొన్ని పర్టిక్యులర్ సినిమాలకు మాత్రమే నంది అవార్డులు వస్తాయి. అయినంత మాత్రాన నంది వస్తే గొప్ప నటులు అనుకుంటే ఎలా.. అది తప్పు అలా అనకూడదు అని కృష్ణవంశీతో అన్నాను. దానితో కృష్ణవంశీ ఏదో పిచ్చి పిచ్చి గా మాట్లాడాడు. చాలా రాష్ గా ఇచ్చాను. ఆ దర్శకుడే మళ్లీ కోట శ్రీనివాస్ రావు ను కావాలని పెట్టుకున్నాడు. ఊరికే వాళ్లకు వాళ్లే గ్రేట్ అనుకొని ,క్రియేటివ్ డైరెక్టర్ అనుకుంటే సరిపోతుందా. అంటూ కాస్త సీరియస్ గా మాట్లాడిన కోట శ్రీనివాసరావు ఆ తర్వాత కృష్ణవంశీ మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ అని పొగిడారు. అప్పుడు కుర్రాడు అందుకే అలా ఆవేశ పడి ఉంటాడు అని కోటశ్రీనివాసరావు తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: