నిధి అగర్వాల్.. ఈమె అంతకు ముందు ఒకటో రెండో సినిమాలు చేసినప్పటికీ, ఆమెకు గుర్తింపు వచ్చిన సినిమా మాత్రం రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ అని చెప్పవచ్చు. అప్పటివరకు ఈమె నటించిన ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈమెను ఐరన్ లెగ్ అని కూడా చాలామంది పిలిచేవారు. కానీ ఇస్మార్ట్ శంకర్ తో తన దశ మారిపోయింది అని చెప్పవచ్చు. అంతే కాదు ఆమె పై పడ్డ మచ్చలను కూడా ఒక సినిమాతో చెరిపేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈమె సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూనే, తన అందచందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. అంతేకాదు ప్రత్యేకంగా ఫోటో షూట్ లు కూడా నిర్వహించి, ఎద అందాలను సైతం చూపిస్తూ కుర్రకారుకు మతి పోగొడుతోంది.

ముఖ్యంగా హాట్ హాట్ ఫోటోలను షేర్ చేయడం వల్ల ఈమెకు అభిమానుల్లో క్రేజ్ మరింత పెరిగిపోయింది అని చెప్పవచ్చు. సినిమాల్లో బిజీగా ఉండకపోయినా, సోషల్ మీడియా తో ప్రేక్షకులకు దగ్గరగా ఉన్న ఈ భామ ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టులు తన చేతిలో పెట్టుకుంది. ఇక ఆ సినిమాలలో ఒకటి జయదేవ్ గల్లా కొడుకైన అశోక్ గల్లా మొదటి సినిమా హీరో , అలాగే మరొక సినిమా  పవన్ కళ్యాణ్ నటిస్తోన్న హరిహర వీరమల్లు.. ఈ రెండు  క్రేజీ ప్రాజెక్ట్ లను తన చేతిలో పెట్టుకొని, మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోంది.


అయితే మొన్న ఆగస్టు 17 వ తేదీన నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా హరిహర వీరమల్లు సినిమా నుంచి నిధికి సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ఇందులో నిధి అగర్వాల్ ని చూస్తే,  మనం రోజు చూస్తున్న నిధి అగర్వాల్ ఏనా అని అనక మానరు. ఈమె సంప్రదాయ కూచిపూడి ఇ వస్త్రాలంకరణ లో, నృత్య భంగిమలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. తన అందాలను దాచుకోకుండా ఇన్నిరోజులు అందరికీ చూపించిన ఈ భామ , ఒక్కసారిగా చీర కొంగుతో చుట్టేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.


అంతే కాదు కేవలం పవన్ కోసం మాత్రమే ఈమె  తన పద్ధతిని కూడా మార్చుకుంటోంది.. అంటూ నెటిజన్స్ నుంచి కామెంట్లు కూడా వస్తుండడం గమనార్హం. ఏది ఏమైనా నిధి అగర్వాల్ ను ఇలా చూస్తేనే చాలా అద్భుతంగా ఉంది అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: