లుక్స్ సంగతి పక్కన పెడితే ప్రభాస్ కి వరల్డ్ వైడ్ ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుందని అందరికి తెలిసిన విషయమే. వెండితెరపై ఆయన కనిపిస్తే చాలు.. నిర్మాతలకు కాసుల వర్షమే కురుస్తుంది. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రభాస్ డిమాండ్ బాగా పెరిగిందని తెలుస్తుంది. అందుకే ఇప్పుడొక హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ప్రభాస్ డేట్స్ కోసం ప్రయత్నిస్తోందని సమాచారం. సదరు నిర్మాణ సంస్థకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ తో పాటు టీవీ ఛానెల్ కూడా ఉందని టాక్ వినిపిస్తుంది.ఇండియాలో కూడా ఈ నిర్మాణ సంస్థకు మంచి పేరుందని సమాచారం
ఇప్పుడు ఈ సంస్థ ప్రభాస్ తో సినిమా ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే ప్రభాస్ కు స్క్రీన్ ప్లే డ్రాఫ్ట్ ను పంపించిందని సమాచారం. ఇదొక హారర్ జోనర్ కథ అని సమాచారం. నిజానికి ప్రభాస్ కి హారర్ సినిమాలంటే చాలా భయమట. గతంలో చాలా సార్లు ఈ విషయాన్ని చెప్పాడని తెలుస్తుంది. అలాంటి జోనర్ లో అస్సలు సినిమాలు కూడా చేయనని చెప్పాడని సమాచారం. మరి ఇప్పుడు ఈ హాలీవుడ్ ప్రాజెక్ట్ కి ఓకే చెప్తారో లేదో చూడాలి మరి ప్రస్తుతం ప్రభాస్ 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్', 'ప్రాజెక్ట్ కె' సినిమాలలో నటిస్తూ బిజీగా వున్నాడని సమాచారం.ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యాం మూవీ దాదాపు పూర్తి అయిందని తెలుస్తుంది.రాధే శ్యాం మూవీని 2022 సంక్రాంతికి విడుదల చేయబోతున్నామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. తరువాత రాబోయే సలార్, ఆది పురుష్ సినిమాలు కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. వాటి విడుదల తేదీలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరి ప్రభాస్ 2022 లో ఒక్క సినిమాతోనే సరిపెడతాడా లేక మూడు సినిమాలు విడుదల చేస్తాడో లేదో చూడాలి మరి.