తెలుగు స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ లో మాస్ ఇంకా క్లాస్ ఆడియన్స్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న నటుడు. ఇక సూపర్ స్టార్ మహేష్ అంటేనే రికార్డులకి మారు పేరు. తన సినిమాలతో తెలుగులో కొత్త కొత్త రికార్డులని మహేష్ సృష్టిస్తూ ఉంటాడు. ఇక గత కాలంగా వరుస హిట్లతో మహేష్ దూసుకుపోతున్నాడని చెప్పాలి. భరత్ అను నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరూ సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు అందుకున్న మహేష్ ప్రస్తుతం పరశురామ్ పెట్ల దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఇక సరిలేరు నీకెవ్వరూ లాంటి మాస్ హిట్ తరువాత చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ కి భారీ అంచనాలే వున్నాయి.ఈ సినిమా గురించి చిన్న అప్ డేట్ వచ్చిన ఫ్యాన్స్ దాన్ని తెగ వైరల్ చేస్తున్నారు.ఇక సర్కారు వారి పాట విషయంలో కూడా పరశురామ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఫ్యాన్స్ కి కావాల్సిన అంశాలని జోడిస్తున్నాడు.

ఇక ఇటీవల మహేష్ బర్త్ డే సందర్బంగా కానుకగా చిత్ర బృందం బర్త్ డే బ్లాస్టర్ పేరుతో చిన్న టీజర్ ని యూ ట్యూబ్ లో విడుదల చేసింది. ఇక రిలీజ్ కి ముందే ఈ టీజర్ యూ ట్యూబ్ లో లీక్ అయ్యింది.అయినా కాని ఈ టీజర్ సరికొత్త రికార్డులని సృష్టిస్తూ మహేష్ స్టామినా ఏంటో నిరూపిస్తుంది.ఇక తాజాగా ఈ టీజర్ సరికొత్త రికార్డుని నమోదు చేసింది.ఈ టీజర్ యూ ట్యూబ్ లో 1 మిలియన్ లైక్స్ ని సాధించింది. పాన్ ఇండియా సినిమా టీజర్ కాకుండా ఒక ప్రాంతీయ సినిమా టీజర్ ఈ రకంగా లైక్స్ అందుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.అది కూడా ఎలాంటి యాడ్స్ కూడా లేకుండా ఈ సినిమా ఈ లైక్స్ అందుకోవడం ఒక రికార్డనే చెప్పాలి.

ఇది పూర్తిగా మహేష్ స్టామినాకి నిదర్శనం. కాని మహేష్ తన స్టామినా ని కేవలం తెలుగు ఇండస్ట్రీకే సరిపెడుతున్నాడు అని కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోలు అలాగే విజయ్ దేవరకొండ, సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్ లాంటి చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాల బాట పడుతుంటే మహేష్ మాత్రం ఎందుకు పాన్ ఇండియా సినిమాలు చెయ్యడానికి ఆసక్తి చూపించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ మహేష్ పాన్ ఇండియా సినిమా కనుక తీస్తే ఇండియాలో వున్న సినిమా రికార్డులన్నీ తుడుచుకుపోవడం ఖాయం.ఇక రాజమౌళితో చేసే సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కనుందని సమాచారం. ఇక అదే గనుక నిజం అయితే ఖచ్చితంగా రికార్డులన్నీ బద్దలవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: