మధ్యప్రదేశ్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. సింగ్రౌలీ జిల్లా మొత్తం పెద్ద ఎత్తున చర్చించుకునేలా చేసింది. భార్య మీద అనుమానం పెంచుకున్న భర్త నీచానికి ఒడిగట్టాడు. శీల పరీక్ష పేరుతో భార్య చేతులూ కాళ్లూ కట్టేశాడు. భార్య యోనికి కుట్లు వేసి తన క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. అదీ అల్యూమీనియం తాడుతో కుట్టడం అతడని అరాచకానికి పరాకాష్టగా నిలుస్తోంది.
ఆ సమయంలో ఆమె నరకయాతన అరణ్య రోదనే అయింది. రైలా గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది.

ఈ విషయం పక్క గ్రామంలోనే ఉండే తన తల్లికి చెప్పింది బాధితురాలు. దీంతో తన తల్లి హృదయం తల్లడిల్లింది. వెంటనే మహిళా ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించింది. అల్లుడిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. జరిగిన విషయాన్ని పూసకుగుచ్చినట్టు చెప్పింది. ఎలాగైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనంటూ పోలీసులను కోరింది. వెంటనే అప్రమత్తమైన ఖాకీలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే మహిళను ఆస్పత్రికి చేర్పించి చికిత్స అందిస్తున్నారు. తన భర్త ఇంత చేసినా.. భార్య మాత్రం అతడిపై దయాగుణాన్ని ప్రదర్శించింది. తన భర్తను కఠినంగా శిక్షించ వద్దంటూ పోలీసులను వేడుకుంది. కేవలం బెదిరించి వదిలేయాలని బతిమిలాడింది. ప్రస్తుతం ఆమె సింగ్రౌలీలోని ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంటుందంటున్నారు వైద్యులు.

పరారీలో ఉన్న భర్తను ఢిల్లీలో అరెస్ట్ చేశారు పోలీసులు. తనకున్న అనుమానం వల్లే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు నిందితుడు  ఒప్పుకున్నాడు. యోనికి కుట్లు వేసే సమయంలో తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడి నుంచి పారిపోయినట్టు చెప్పాడు. అతడు డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నట్టు వెల్లడించాడు. మొత్తానికి కట్టుకున్న భార్యపై అనుమానంతో ఆ భర్త చేసిన ఘాతుకం అందరిలో ఆగ్రహాన్ని తెప్పించింది. బాధితురాలి వయసు కేవలం 24సంవత్సరాలు మాత్రమే. ఇంత చిన్న వయసులో భర్త చేతిలో అంతటి నరకాన్ని అనుభవించింది.






మరింత సమాచారం తెలుసుకోండి: