ముఖ్యంగా యూత్ అందరికీ కూడా తొలిప్రేమ జ్ఞాపకాలను మరోసారి మరో సారి నెమరు వేసుకునేలా చేసింది. ఇలా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుని సూపర్ హిట్ సాధించింది ఈ సినిమా. కాలేజీ లో ప్రారంభమైన వీరి ప్రేమ కథ చివరికి ఒక చిన్న కారణంతో విడిపోతుంది. ఆ తర్వాత ఇద్దరూ ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నప్పటికీ దూరంగానే ఉంటారు. కానీ ఆ తర్వాత ఒకానొక సమయంలో అనుకోకుండా కలుస్తారు. ఆ సమయంలో వారి తొలి ప్రేమ జ్ఞాపకాలు మళ్లీ చిగురిస్తాయి. ఇలాంటి సమయంలోనే దర్శకుడు కొన్ని సెంటీమెంట్ డైలాగులతో సినిమాను ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా చేశాడు.
జ్ఞాపకాలు మంచివైనా చెడ్డవైనా.. ఎప్పుడూ మనతోనే ఉంటాయి అంటూ ఇక దర్శకుడు హీరోతో చెప్పించిన డైలాగులు ప్రతి తెలుగు ప్రేక్షకుడి హృదయాన్ని తాకాయి. ఇక ఈ సినిమాలోని ప్రతి పాట కూడా సినిమాకి ప్రాణం పోసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా తొలిప్రేమ సినిమా నిజంగానే ప్రతి ఒక్కరికి తొలిప్రేమ జ్ఞాపకాలను గుర్తు చేసింది. ఇలా అద్భుతమైన లవ్ స్టోరి తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని అదరిపోయే హిట్ కొట్టాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.