బుల్లితెర తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్5 సెప్టెంబర్ 5 అంటే వచ్చే ఆదివారం నుంచే ప్రారంభం కానుంది.గత సీజన్ ని హోస్ట్ చేసిన కింగ్ నాగార్జునే తాజా సీజన్ ని హోస్ట్ చేస్తున్నారు.ఇప్పటికే నాలుగు సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో కి ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ఐదవ సీజన్ పై కూడా ఆడియన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే మరి సీజన్ 5 ఆశించిన స్థాయిలో సక్సెస్ అవుతుందా? అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ప్రశ్నకి నెటిజన్ల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సీజన్ 5 స్టార్ట్ కాకముందే ఈ షోలో పాల్గొనే..

 కంటెస్టెంట్ల లిస్ట్ కి సంబంధించిన పేర్లు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..ఇప్పుడు అవే పేర్లు ఫిక్స్ కావచ్చని తెలుస్తోంది.అయితే ఇలా షో స్టార్ట్ కాకముందే సీజన్5 కి సంబంధించిన విషయాలు లీక్ అవ్వడం వల్ల అది షో రేటింగ్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది.మరోవైపు బిగ్ బాస్ సీజన్ 5 రాత్రి 10 గంటలకు ప్రసారం అవుతుండడటం కూడా ఒకింత బిగ్ బాస్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతుంది.ఎందుకంటే ఆ టైమ్ లో ఈ షో ని ప్రేక్షకులు చూస్తారా?అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.దీంతో పాటుగా ఇప్పటికే సోషల్ మీడియాలో లీకైన కంటెస్టెంట్ల పేర్లు కూడా షో పై పెద్దగా ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడం లేదు.ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ సీజన్ 5 ..

ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటుందా? భారీ టీఆర్పీ ని సొంతం చేసుకుంటుందా? అనేది గమనార్హంగా మారింది.మరోవైపు  జెమినీ టీవీ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో నుంచి బిగ్ బాస్ షో కి రేటింగ్స్ విషయంలో పోటీ ఎదురవుతోంది.బిగ్ బాస్ సీజన్ 5 రేటింగ్స్ ఎవరు మీలో కోటీశ్వరులు షో కంటే తక్కువగా ఉంటే బిగ్ బాస్ షో పై ప్లాప్ షో అనే ముద్ర పడే అవకాశాలు ఉన్నాయి.అయితే గత సీజన్లకు ఇలాంటి సమస్యలేవి రాలేదు. కానీ ఈసారి కరోనా రావడం వల్ల షో ఆలస్యంగా ప్రారంభం కావడం, అదే సమయానికి ఇతర ఛానెల్స్ లో కూడా పలు షోలు పోటీకి రానుండటంతో ఈసారి బిగ్ బాస్ నిర్వాహకులకు పెద్ద దెబ్బె పడేలా కనిపిస్తుంది.మరి బిగ్ బాస్ సీజన్ 5  ప్రేక్షకులను ఈ స్థాయిలో మెప్పించనుంది, రేటింగ్స్ కోసం నాగార్జున ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేయనున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: