ఇప్పుడున్న కొత్త హీరోయిన్ లలో చాలా మంది ఒక్క సినిమాతోనే స్టార్ డం ను సంపాదించుకుంటున్నారు. కొందరైతే రెండు మూడు సినిమాలు చేసినా మళ్లీ మొదటి సినిమా హీరోయిన్ లాగానే అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడు అదే కోవలోకి వస్తుంది మన వకీల్ సాబ్ లో ప్రముఖ పాత్ర పోషించిన యువ కథానాయిక అనన్య నాగళ్ల.. ఈ సినిమాకు ముందు రెండు సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క వకీల్ సాబ్ తో వచ్చేసింది. ఈ సినిమా కరోనా సమయంలో థియేటర్లో విడుదల చేసినా జనం పోటెత్తారు. కట్ చేస్తే ఎన్నో రికార్డులను పవన్ కళ్యాణ్ మరియు చిత్ర బృందం సొంతం చేసుకుంది. ఇందులో నటించిన అందరికీ మంచి పేరు వచ్చింది.

అయితే ఈ విజయంతో అనన్య వరుస సినిమాలు చేస్తూ బిజీ అవుతుందేమో అనుకున్నారు. కానీ ఇప్పటికి అధికారికంగా ఏ మూవీ లోనూ చేస్తున్నట్లు దాఖలాలు లేవు. అయితే రెగ్యులర్ గా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ తన లేటెస్ట్ ఫోటో షూట్ లతో కుర్ర కారును హోరెత్తిస్తోంది. కానీ తాజాగా చిత్ర పురిలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఒక కుర్ర హీరో సినిమాలో హీరోయిన్ గా చేయడానికి ఆ డైరెక్టర్ ఈమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ లు ఉండగా అందులో అనన్యది మెయిన్ రోల్ అని తెలుస్తోంది.

మరి ఆ హీరో ఎవరో? సినిమా ఏమిటో అన్న పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ఒక వేళ ఈ వార్త కనుక వాస్తవ రూపం దాల్చితే అనన్య కెరీర్ ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. మరి ఏమి ఇది గాసిప్ గానే మిగులుతుందా లేదా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడక తప్పేలా లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: