టాలీవుడ్ లెజెండ్ అక్కినేని నాగేశ్వర రావు ముఖ్య పాత్రలో శ్రీకాంత్ హీరోగా నటించిన సినిమా పండగ. 1998లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకాభిమానుల నుండి మంచి క్రేజ్ దక్కించుకుంది. రాశి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నిర్మలమ్మ, వై విజయ, చలపతి రావు, బాబూమోహన్, తనికెళ్ళ భరణి, అన్నపూర్ణమ్మ సహా మరికొందరు సీనియర్ నటులు కీలక పాత్రలు చేసారు. దర్శకుడు శరత్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ యాక్షన్ డ్రామా మూవీకి పోసాని కృష్ణమురళి కథని అందించగా జయశ్రీ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై దీనిని ఆర్ బి చౌదరి నిర్మించారు.

ఇక కథ ప్రకారం పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా జీవితం గడుపుతున్న లక్ష్మి రాఘవ వరప్రసాద్, తన యుక్త వయసులో విజయలక్ష్మి అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకోవాలనుకోవడం, ఆ తరువాత కుటుంబ పరిస్థితుల కారణంగా ఆమెను పెళ్లిచేసుకోలేకపోవడం జరుగుతుంది. అయితే కాల గమనంలో ఆపై బ్రహ్మచారి గానే మిగిలిపోయి తన ఉమ్మడి కుటుంబంతో కలిసి ఆయన జీవిస్తుంటారు ఆయన. అయితే ఆ తరువాత కొన్నేళ్ళకు ఆనంద్ అనే వ్యక్తి వారి కుటుంబంలో ఉద్యోగిగా చేరి మెల్లగా రాఘవ వర ప్రసాద్ మెప్పు సంపాదించి, చివరికి తాను ఒకప్పుడు మీ వలన మోసపోయి గర్భవతి అయిన స్త్రీకి పుట్టిన బిడ్డనని తండ్రి రాఘవ వరప్రసాద్ కి చెప్తాడు. అతడే తన కొడుకు అని తెలిసి రాఘవ వరప్రసాద్ ఎంతో మురిసిపోతారు. ఆపై కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆస్థి కోసం రాఘవ వరప్రసాద్ పై కుట్ర చేసి హత్య చేయబోవడం జరుగుతుంది.

ఈ సినిమాలో ముఖ్యంగా అన్న, చెల్లెళ్లు, అలానే తండ్రి కొడుకుల మధ్య బంధాలు అనుబంధాలను ఎంతో హృద్యంగా తెరకెక్కించారు దర్శకుడు శరత్. అయితే ఎంత బంధువులు అయినప్పటికీ కూడా ఆస్థి కోసం తనని స్వయానా బావమరుదులు చంపబోవడంతో తనకు వారందరూ, అలానే కొడుకు మాత్రమే ముఖ్యం అని చివరికి వారందరికీ సమానంగా ఆస్తిని పంచి ఇస్తారు రాఘవ వర ప్రసాద్. ఇక ఈ సినిమా లో వచ్చే ఎమోషనల్ సీన్స్ తో పాటు మధ్యలో వచ్చే కామెడీ సీన్స్, అలానే కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఏఎన్నార్, శ్రీకాంత్ ల మధ్య వచ్చే సీన్స్ అయితే ఎంతో బాగుంటాయి. మొత్తంగా ప్రేక్షకాభిమానులకు ఈ సినిమా కన్నుల పండగ ని అందించిందని చెప్పవచ్చు.      

మరింత సమాచారం తెలుసుకోండి: