ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం అటు బుల్లితెర పై టాప్ కామెడీ షో గా కొనసాగుతుంది. ఎన్నో ఏళ్ల నుంచి విజయవంతంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది.  ఇక జబర్దస్త్ కార్యక్రమం లో ప్రతీ వారం కూడా సరికొత్త కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. అయితే అటు జబర్దస్త్ కార్యక్రమంలో భాగంగా బాగా క్రేజ్ సంపాదించుకున్న టీం  ఏది అంటే అటు హైపర్ ఆది టీం అనే విషయం తెలిసిందే. కేవలం హైపర్ ఆది టీం పర్ఫామెన్స్ కోసం మాత్రమే చాలామంది జబర్దస్త్ చూస్తారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఇక ప్రతి వారం కూడా తనదైన శైలిలో సరికొత్త స్కిట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాడు హైపర్ ఆది.  ఆది టీం స్కిట్ చేస్తున్నంతసేపు అటు బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వుకుంటూ ఉంటారు. అయితే హైపర్ ఆది టీంలో సహా టీం లీడర్ గా కొనసాగుతున్నాడు రైజింగ్ రాజు.  ఇక రైజింగ్ రాజుఫై హైపర్ ఆది ఎన్నో ఊహించని పంచులు వేస్తూ కామెడీని పండిస్తూ ఉంటారు. అయితే గత కొంత కాలం నుంచి హైపర్ ఆది సహా టీమ్ లీడర్ రైజింగ్ రాజు జబర్దస్త్ లోకి రావడం లేదు. ఈ క్రమంలోనే  ఇక రైజింగ్ రాజు ఎందుకు జబర్దస్త్ లోకి రావడం లేదు అన్న ప్రచారం ఊపందుకుంది.



 అటు ఫాన్స్ కూడా ఎంతో అయోమయంలో పడిపోయారు. ఎప్పుడెప్పుడు రైజింగ్ రాజు మళ్లీ జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇస్తాడా అని ఎదురు చూసారు. ఇక ఇప్పుడు ఫాన్స్ కోరుకున్నది జరిగింది. ఇక ఇటీవల విడుదలైన జబర్దస్త్ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రోమోలో భాగంగా మరోసారి హైపర్ ఆది టీం లోకి సహ టీం లీడర్ అయిన రైజింగ్ రాజు వచ్చేసాడు. ఇక రావడం రావడమే తనదైన శైలిలో కామెడీ పంచుతూ ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేసాడు రైజింగ్ రాజు. ఇక రైజింగ్ రాజు మళ్ళీ జబర్దస్త్ లోకి రావడంతో అభిమానులు అందరూ ఊపిరి ఆనంద పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: