మణిరత్నం.. తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడిగా గుర్తింపు పొందడమే కాకుండా తెలుగులో కూడా కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇదంతా ఆయన తమ్ముడు ఉన్నప్పుడు మాత్రమే మణిరత్నం ఒక వెలుగు వెలిగాడు అని చెప్పవచ్చు. అన్నదమ్ములు ఇద్దరి మధ్య కొన్ని అనుకోని కారణాల వల్ల మనస్పర్థలు ఏర్పడడంతో ,మణిరత్నం తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. తమ్ముడి మరణం తర్వాత మణిరత్నం కు పెద్దగా కలిసి రాలేదనే చెప్పవచ్చు. ఇటీవల ఈయనపై కేసు నమోదైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఏంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..
తమిళ్లో ఇటీవల ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న సినిమా పొన్నియిన్ సెల్వన్. ఇక ఈ సినిమా దాదాపు యాభై సంవత్సరాల క్రితం కల్కి రాసిన ఒక చారిత్రాత్మక నవల ఆధారంగా.. మణిరత్నం ఒక అద్భుతమైన కథను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఒక చారిత్రాత్మక కల్పన. ఇందులో అన్ని ఎక్కువగా నిజమైన చారిత్రక పాత్రలు, సంఘటనలు ఉండడం గమనార్హం. కల్కి రాసుకున్న ఒక నవల ఆధారంగా పూర్తిగా నిజ సంఘటనలు, ఈ సినిమాలో తెరకెక్కించడం జరిగింది..
ఈ సినిమా కథ విషయానికి వస్తే, కిరీటం కోసం యువరాజు ఆదిత్య కరికాలన్ మహారాజు అలాగే యువరాణి కి సందేశం అందించడం కోసం చోళ దేశానికి వెళ్లే ఒక మనోహరమైన యువకుడు వందియథేవన్ చుట్టూ సాగే కథ ఇది. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవల హైదరాబాదులో జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ప్రత్యేకంగా ఈ సినిమా కోసం హైదరాబాద్లో ఒక అద్భుతమైన సెట్టింగ్ కూడా వేయడం జరిగింది.
ప్రమాదవశాత్తు షూటింగ్ లో గుర్రం చనిపోవడంతో మణిరత్నం మీద ఎఫ్ఐఆర్ కేసు నమోదైనట్లు సమాచారం. రాజులు, రాణుల మధ్య సాగే ఈ కథలో గుర్రాలను తప్పకుండా ఉపయోగించాలి.. అలాంటప్పుడు జాగ్రత్త వహించాల్సిన బాధ్యత దర్శకుడి మీద ఉంటుంది ..కాబట్టి గుర్రం చనిపోవడంతో దర్శకుడి మీద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.