రెజ్లింగ్ కు అమెరికాలోనే కాకుండా భారత్ లో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇక రేజ్లర్లలో జాన్ సీనా ను భారతీయులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. జాన్ సీనా ఎన్నో సార్లు ప్రపంచ ఛాంపియన్ షిప్ ను సొంతం చేసుకోవడంతో పాటు ఎంతో మంది యోదులపై విజయం సాధించాడు. జాన్ సీనా ఆట తీరు కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇక భారతీయులు ఎంతో ఇష్టపడే జాన్ సీనా కూడా భారతీయులపై తన పోస్ట్ లతో సోషల్ మీడియాలో అభిమానం చూపిస్తుంటారు. 2020లో జాన్ సీనా బిగ్ బాస్ సీజన్ 13 లో రన్నర్ గా నిలిచిన కంటెస్టెంట్ ఫోటో షేర్ చేశారు.
కాగా తాజాగా జాన్ సీనా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో బిగ్ బాస్ విన్నర్ సెప్టెంబర్ 2న కన్నుమూసిన సిద్ధార్థ శుక్ల ఫోటోలు షేర్ చేశారు. అయితే ఈ ఫోటోకి జాన్ సీనా ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు. కానీ జాన్ సీనా ఈ రోజు ఫోటో షేర్ చేసి సంతాపం ప్రకటించినట్టు అర్థం అవుతోంది.ఇక ఇప్పటికే బాలీవుడ్ దిగ్గజాలు అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా, సల్మాన్ ఖాన్ లాంటి వారు సిద్ధార్థ్ మరణంపై సంతాపం ప్రకటిస్తూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జాన్ సీనా కూడా సిద్ధార్థ్ శుక్లా ఫోటోలు షేర్ చేయడం చెప్పుకోదగ్గ విషయం. దాంతో సిద్దార్థ్ అభిమానులు జాన్సీనా పోస్ట్ కు థాంక్స్ చెబుతున్నారు. ఇక మరికొందరు అభిమానులు సిద్ధార్థ్ ను మిస్ అవుతున్నాం అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలా ఉండగా సిద్ధార్థ్ శుక్ల హిందీ లో బాలికా వధు సీరియల్ తో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత హమ్టీ శర్మ కి దుల్హనియా సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలో వరుణ్ ధావన్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించారు. కాగా సిద్దార్థ్ శుక్లా సినిమాలో అలియా భట్ ను పెళ్లి చేసుకునేందుకు వచ్చిన పెళ్లి కొడుకు పాత్రలో నటించారు ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సిద్ధార్థ్ సంపాదించుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే బిగ్ బాస్ లో పాల్గొని ఎంతోమంది అభిమానాన్ని సిద్దార్థ్ సొంతం చేసుకున్నారు. కానీ సెప్టెంబర్ 2న 40 ఏళ్ల వయసులోనే సిద్ధార్థ శుక్ల హార్ట్ ఎటాక్ తో మరణించడం యావత్ సినీ లోకాన్ని విషాదంలో నింపింది.